sleep : మనిషి శరీరానికి, మెదడుకు విశ్రాంతి దొరికి, తిరిగి శక్తిని పుంజుకోవటానికి ప్రకృతి సిద్ధమైన ఏర్పాటు నిద్ర ! నిద్రపోయేటప్పుడు కండరాలన్నీ సడలి ఉంటాయి. ప్రతిరోజూ మనిషి ఒక క్రమం ప్రకారం కొంత సమయం పాటు తప్పకుండా నిద్రపోవాలి.
రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి?
మనిషి రోజుకి సగటున ఏడెనిమిది గంటలు నిద్రపోయినా అతని జీవితంలో మూడవ వంతు నిద్రలోనే గడిచినట్టు లెక్క నిజానికి ఇంతకన్నా ఎక్కువే నిద్రపోయే కుంభకర్ణు లెంతమందో ఉన్నారీ భూమ్మీద!
“నేను జీవితమంతా కష్టపడి పనిచేశానని, నా జీవిత మంతా మానవాళికే అంకితం చేశానని” – ఏ మహానుభావుడన్నా అంటే ఆయన కూడా తన జీవితంలో కనీసం 25 సంవత్సరాలు నిద్రపోయి ఉంటాడు.
మనిషికి రోజుకి నాలుగ్గంటల నిద్ర చాలని ఎంతో కాలమయింది తేల్చి! మిగతా జీవితం ప్రయోజనకరంగా మలుచుకొని ఆ నాలుగ్గంటలే నిద్రపోతే సరిపోలా? ఆలోచించండి!
నిద్ర వలన లాభాలు
- నిద్రపోతున్న సమయంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి, హార్మోనుల ఉత్పత్తికి సంబంధించిన వ్యవస్థలు చెప్పుకోదగ్గ మార్పులకు లోనవుతాయి. ఈ రెండూ మన శరీరాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడటానికి ఉపకరిస్తాయి. అందుకే జ్వరం, అలసట లాంటి అస్వస్థతలు నిద్రనుంచి లేచేసరికి తగ్గినట్లుగా అన్పిస్తాయి.
- మన శరీరం ఇన్ఫెక్షన్కి గురయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్తో పోరాటానికి ఉపయోగపడే “సైటోకిన్” (Cytokine) అనే రసాయన పదార్థం నిద్రాసమయంలోనే అధిక మొత్తంలో, మన రక్త ప్రవాహంలోకి విడుదలవుతుంది.
- రాత్రి నిద్రా సమయంలో ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్లు థైరాయిడ్, సెక్స్ హార్మోనుల ఉత్పత్తి అధికంగా ఉంటుంది.
- నిద్రపోయే సమయంలో శరీరంలోని శక్తిని నిలవచేయటం కోసం శరీరపు ఉష్ణోగ్రత తక్కువ స్థాయికి దిగి శక్తిని వృధా కానివ్వకుండా కాపాడుతుంది.
- భూతద్దంలోంచి చూస్తే సాయంత్రానికి మన చర్మం పొడిగా, పొలుసులు, పొలుసులుగా నలుపు తిరిగి కనిపిస్తుంది. రాత్రి నిద్రపోయి తెల్లారి లేచేసరికి అదే చర్మం నునుపుగా, మెరుపుగా, జిడ్డాడుతూ కనిపిస్తుంది. అంతేకాదు చక్కగా నిద్ర పట్టిన తెల్లారి చర్మం మీద మడతలు, గీతలు కూడా తగ్గినట్లు కన్పిస్తుంది.
- నిద్రపోతున్న సమయంలో చర్మానికవసరమైన పోషక పదార్థాలు నిరంతరంగా సరఫరా అవుతాయి. అందుకనే నిద్ర లేచాక చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. నిద్ర లేనప్పుడు అదే చర్మం పొడిబారి కన్పిస్తుంది.
also read :
moral stories in telugu : మొదటికే మోసం.. కథ చదవండి
balagam mogilaiah : విషమంగా బలగం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి.. హైద్రాబాద్ ఆసుపత్రిలో చేరిక
Horoscope (12-04-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
capsicum tomato curry : క్యాప్సికమ్ టమోటా కర్రీ .. ఈ కూర తిన్నారంటే.. ఆహా అనాల్సిందే..