బిగ్ బాస్ సీజన్ 6 (bigg boss telugu 6) లో కంటెస్టెంట్స్ మరి సోమరిపోతుల్లా కనిపిస్తున్నారు. ఇచ్చిన టాస్క్‌లు సరిగ్గా ఆడకపోగా, పక్కనోళ్ల భవిష్యత్ చెప్పడంలో ఎక్స్పర్ట్స్ అయ్యారు. ఇందులో గీతూ ముందుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇనయ, శ్రీహాన్‌లు ఇప్పుడిప్పుడే కలుస్తున్నట్టు కనిపించారు. మొదటి నుంచి వస్తున్న గొడవల వల్ల నిన్నునామినేట్ చేశాను కాని..నిజంగా ఈ వారం నిన్నుఅనడానికి ఏమీ లేదు అని అనడంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇక టాస్క్ లో భాగంగా హౌస్ మెంట్స్ చేసిన తప్పులకు బిగ్ బాస్ పెద్ద శిక్షే విధించాడు. ఒక్కొక్కరికి ఆకలి విలు తెలియజేయాలిన అనుకున్నాడు.
శిక్ష తప్పలేదు..
అందుకోసం ఇంట్లో ఉండే ఫుడ్ మొత్తం తీసుకెళ్లాడు. సీక్రెట్‌గా దాచుకున్న తిండి అంతా కూడా తీసుకెళ్లడంతో పాటు..ఎవరైనా దాచుకుని ఉంటే వాటిని కూడా తీసుకువచ్చి స్టోర్ రూమ్ లో పెట్టాలంటూ బిగ్ బాస్ ఆదేశం ఇవ్వడంతో అందరు డీలా పడ్డారు. ఇక హౌజ్‌మేట్స్‌ని రెండు గ్రూప్స్‌గా విభజించిన బిగ్ బాస్.. గెలిచిన వారికి మాత్రమే ఆహారం అందించే ప్రోగ్రామ్ పెట్టాడు. ఇక కండీషన్ ఏంటంటే ఒకగ్రూప్ కి వచ్చిన ఆహారం మరొక గ్రూప్ తీసకోకూడదు . ఇక మొదటి రౌండ్ లో భాగంగా టీమ్ కబడ్డి ఆడి దాల్,రైస్ గెలుచుకున్నారు. ఇక మరొక రౌండ్ లో సెకండ్ టీమ్ మెంబర్స్ బాల్స్ గేమ్ లో గెలిచి చపాతీలు దక్కించుకున్నారు.
ఇవి కూడా చూడండి :
తీయని పాట మీ గొంతులో పలకాలంటే… ఇలా చేయండి.