Homedevotionalhoroscope today telugu : 14-05-2023 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today telugu : 14-05-2023 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 14th may 2023: Check astrological prediction for your zodiac signs

మేష రాశి

ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉంటుంది.. ఖర్చులు అధికమగును. ధన నష్టము కూడా క‌లిగే అవ‌కాశం ఉంది.. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వాహనాలు, గృహాలు వంటి వాటికి ధనము ఖర్చు చేస్తారు.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఉద్యోగమునందు అనుకూలము, వ్యాపారమునందు లాభములు కలుగుతాయి.. వృషభరాశి వారికి వాక్ స్థానమునందు కుజుని సంచారం వలన గొడవలు, వాగ్వివివాదములకు దూరంగా ఉంటే మంచిది. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి.

మిథున రాశి

ఈ రాశివారికి శారీరక శ్రమ, మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించ‌డం ఉత్త‌మం. మిథునరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం ఉత్త‌మం.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారములయందు మధ్యస్థ ఫలితములు ఏర్పడుతుంటాయి.. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించ‌డం మంచిది. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

సింహ రాశి

ఈ రాశి వారికి పనులయందు శ్రమ మరియు చికాకులు అధికమగును. ఆర్థిక విషయాలు ఇబ్బంది పెట్టు అవ‌కాశం ఉంది. గొడవలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.. లాభములో కుజుని ప్రభావం చేత సింహరాశి ఉద్యోగస్తులకు అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

-Advertisement-

కన్యా రాశి

ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు లాభదాయకముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము అని చెప్పాలి. ప్రతీ పనియందు విజయాన్ని చూచెదరు. ధనలాభము, కీర్తి కలుగుతుంది. ఈ రోజు మరింత శు భ ఫలితాలు పొందడం కోసం కన్యారాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే మంచిది

తులా రాశి

ఈ రాశి వారికి కుజుని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలుగుతుంది.. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు కొంత జాగ్రత్తగా ఉండ‌డం మంచిది. విద్యార్థులకు అనుకూలమైన సమయముగా చెప్పాలి.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వ‌హించ‌డం మంచిది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. ప్రయాణములు అనుకూలిస్తాయి.. శారీరక శ్రమ అధికముగా ఉండును. వివాదములకు దూరంగా ఉండ‌డం మంచిది.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చే అవ‌కాశం ఉంది.. చేసే పనులయందు విజయము పొందెదరు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయాల్సి ఉంటుంది.

మకర రాశి

ఈ రాశి వారికి కుటుంబమునందు సమస్యలు, వివాదాలు, మానసిక ఘర్షణలు అధికమగును. ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించ‌డం మంచిది. చేప‌ట్టే ప‌నుల యందు ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది

కుంభ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలతో వాగ్వివిదాలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును.ఈ రాశి వారు గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన.

మీన రాశి

ఈ రాశి వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు చెడు సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉంటాయి. మీన రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

also read :

Indigestion: వేసవిలో అజీర్తి నివారణకు ఇవి తినండి..

Bypolls: దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ

Karnataka Election Results: కర్ణాటకలో బీజేపీ మతం కార్డు పని చేయలేదా? ఓటమికి కారణాలెన్నో!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News