Telugu Flash News

Horoscope (28-03-2024) : ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

horoscope today in telugu ఈ రోజు రాశి ఫలాలు

Horoscope Today, 28th March 2024: Check astrological prediction for your zodiac signs

Aries | మేష రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయరంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వ‌చ్చే ఛాన్స్ ఉంది.. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు త‌ర‌చు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది.

Taurus | వృషభ రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది.. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. గౌరవ, మర్యాదలు అధికం అయ్యే ఛాన్స్ ఉంది. అద్భుత శక్తి సామర్థ్యాలను కూడా పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.

Gemini | మిథున రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం ఉత్త‌మం వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు ద‌క్కుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు త‌లెత్తే ఛాన్స్ ఉంది..

Cancer | కర్కాటక రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారికి నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఎక్కువ‌గా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభించే ఛాన్స్ ఉంది.. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉండాలి.

Leo | సింహ రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఎక్కువ‌గాఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ఏ మాత్రం ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవ‌కాశం ఉంది.

Virgo | కన్యా రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పనిస‌రి.. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు ఏ మాత్రం పనికిరాదు.

Libra | తులా రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారికి బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను కొంత అనుభ‌విస్తారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురి చేసే అవ‌కాశం ఉంది.. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వ‌దిలి వేయ‌డం ఉత్త‌మం.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారు బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరే ఛాన్స్ ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఏ మాత్రం ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభించే అవ‌కాశం ఉంది.. అన్నివిధాలా సుఖాన్ని కూడా పొందుతారు.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారు అన్ని విష‌యాల‌లో జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువ‌గాన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంచుకోవాలి.

Capricorn | మకర రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారికి రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందే ఛాన్స్ ఉంది. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం చాలా అవ‌స‌రం.

Aquarius | కుంభ రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఎక్కువ‌గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఎక్కువ‌గా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరే ఛాన్స్ ఉంది.

Pisces | మీన రాశి ఫలాలు 28-03-2024

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో స్వ‌ల్ప మార్పులు ఉంటాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభించే అవ‌కాశం ఉంది.

 

 

Exit mobile version