Telugu Flash News

Horoscope Today Telugu (24-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today in telugu ఈ రోజు రాశి ఫలాలు

Horoscope Today, 24th March 2024: Check astrological prediction for your zodiac signs

Aries | మేష రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారు అనుకున్నట్టు పనులు జరగక పోవ‌డం వ‌ల‌న ఆవేద‌న చెందుతారు . తోబుట్టువులతో విభేదాలు తలెత్తే సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ల‌భిస్తుంది.

Taurus | వృషభ రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారు విలాసాల మీద ఖర్చు చేయడం ఎక్కువ అవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం ఉత్త‌మం. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు ఎక్కువ‌గాశుభవార్త వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఒక్క నిమిషం కూడా తీరిక లేని స్థితిలో ఉంటారు

Gemini | మిథున రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్త‌మం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారికి దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి రావ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఒత్తిడి చెందే అవ‌కాశం ఉంది.

Leo | సింహ రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే అవ‌కాశం ఎక్కువ‌. వ్యాపారులు నిలకడగా లాభాలు సంపాదిస్తారు. ఐటీ నిపుణులకు సమయం అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది.

Virgo | కన్యా రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారు కుటుంబ పరంగాను, ఆర్థికంగానూ సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి.. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య కూడా ప‌రిష్కారం అవుతుంది.

Libra | తులా రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారు అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. పిల్లలతో సరదాగా కాలక్షేపం చేసే అవ‌కాశం ఉంది. ఉద్యోగంలో సహచరుల కారణంగా ఒకటి రెండు సమస్యలు ఇబ్బంది పెడతాయి . ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఎక్కువ‌గా ఉంటుంది.. భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఎక్కువ‌గా ఉంది.

Capricorn | మకర రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. పొదుపులు, మదుపులు ప్రారంభిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిత్రులతో విభేదాలు సమసిపోయే అవ‌కాశం ఉంది.

Aquarius | కుంభ రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అధికార యోగానికి అవకాశం ఎక్కువ‌గా ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం ఉత్త‌మం.. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫ‌లితాన్ని అందిస్తాయి.

Pisces | మీన రాశి ఫలాలు 24-03-2024

ఈ రాశి వారు ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు.ఆర్థిక సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి సమయం అనుకూలంగానే ఉంటుంది. డాక్టర్లు లాయర్లు ఐటి వారు పురోగతి సాధిస్తారు. చదువుల్లో పిల్లలు ముందడుగు వేయ‌డం వ‌ల‌న సంతోషం క‌లుగుతుంది.

also read :

Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?

Srimad Bhagavatam : An Overview of its Stories and Teachings

 

Exit mobile version