Telugu Flash News

Horoscope (02-04-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope today telugu 02 04 2024

today horoscope in telugu : ఏప్రిల్ 02, 2024 ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Aries | మేష రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేష రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగములో అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించ‌డం మంచిది.

Taurus | వృషభ రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశి వారుఆరోగ్య విషయాల యందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఒత్తిళ్ళు వేదనలు అధికముగా ఉండును. మనస్తాపము, అనారోగ్యం కలుగు సూచనలున్నాయి. విద్యార్థులకు ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు వ‌హించాలి.

Gemini | మిథున రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశి వారికి రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు ఏర్పడును. ఇంట్లో కొంత చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 02-04-2024

కర్కాటక రాశి వారు ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేస్తారు. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగుతుంది. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించాల్సి ఉంది. ఆరోగ్య విషయాల యందు, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం ఎంతో అవ‌స‌రం.

Leo | సింహ రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు ఉద్యోగ వ్యాపారాలయందు మధ్యస్థ ఫలితములు అధికముగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. సింహరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించ‌డం మంచిది.

Virgo | కన్యా రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశి వారికి గ్రహాల అనుకూల స్థితి వలన విజయం పొందెదరు. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు ఎంతో అనుకూలిస్తాయి.. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం ఎంతైన అవ‌స‌రం.

Libra | తులా రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశి వారికి ప్రతీ పనియందు చికాకులు, సమస్యలు ఏర్పడును. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు, కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధించును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉంటాయి.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశికి చేసే ప్రతీ పనియందు విజయాన్ని పొందెదరు. కుటుంబముతో ఆహ్లాదముగా గడుపుతారు.. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని స‌కాలంలో పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. అప‌రిచితుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 02-04-2024

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. ఆర్ధిక సమస్యలు , పనుల యందు ఆలస్యము జ‌రుగుతుంది.. గొడవలకు దూరంగా ఉండటం ఉత్త‌మం.

Capricorn | మకర రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశి వారికి వ్యయస్థానమునందు రవి, బుధుల ప్రభావం చేత ఖర్చులు అధికమవుతాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఏర్ప‌డుతుంది. వీరికి చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం ఎంతైన అవ‌స‌రం.

Aquarius | కుంభ రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు అప్పు పుట్టును. ద్వితీయ స్థానమునందు గురుని వలన కుంభరాశివారికి కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగుతారు.. ఏలినాటి శని వలన చేసే ప్రతీ పనియందు కొంత ఆటంకములు ఏర్పడుతుంది.

Pisces | మీన రాశి ఫలాలు 02-04-2024

ఈ రాశి వారికి ఆర్ధిక లాభములు వ్యాపార లాభము కలుగును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కీర్తి మరియు సౌఖ్యము కలుగును. మీన రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించ‌డం మంచిది.

Exit mobile version