Homehoroscopehoroscope today july 24, 2023 - ఈ రోజు రాశి ఫలాలు 24-07-2023

horoscope today july 24, 2023 – ఈ రోజు రాశి ఫలాలు 24-07-2023

Telugu Flash News

Horoscope Today, july 24, 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Aries horoscope

ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మనోధైర్యంతో పని చేయడం వల్ల కీర్తి, సంపదలు లభిస్తాయి. సంతోషకరమైన సంఘటనలు సంభవించడం వల్ల వారు ప్రశాంతంగా ఉంటారు. నమ్మకంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Taurus horoscope

ఈరోజు ఈ రాశివారు పనితీరుకు ప్రశంసలు అందుకుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారు ప్రోత్సాహకర వాతావరణంలో పని చేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Gemini

ఈ రోజు ఈ రాశికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా డబ్బు ఖర్చు. అతి విశ్వాసం అస్సలు మంచిది కాదు. కొన్ని పరిస్థితులు నొప్పిని కలిగిస్తాయి కాబట్టి కొంతమంది నిరాశకు గురవుతారు. పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Cancer horoscope

ఈరోజు ఈ రాశి వారు ఇతరుల సహకారంతో ముందుకు సాగితే మంచిది. కీలకమైన విషయంలో ధైర్యంగా ముందడుగు వేసి.. అందరి ప్రశంసలు పొందండి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టమేర్పడే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం అవహిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Leo

ఈ రోజు ఈ రాశి వారు మానసికంగా సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Virgo

ఈ రాశి వారు ఈ రోజు అనవసర చింతలకు దూరంగా ఉండటం మంచిది. మధ్యస్థ ఫలితాలు అందుకుంటారు. సమస్యల జోలికి పోకుండా నలుగురితో కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండుట మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Libra horoscope

ఈ రోజు ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధించి సంతోషంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొనడమే కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థాన చలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Scorpio

ఈ రోజు ఈ రాశి వారు కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని పనులు సజావుగా చేస్తారు. కీలక సమస్యలను పరిష్కరించడం పట్ల వారు సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలుంటాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Saggitarius

ఈ రాశి వారు ఈ రోజు మధ్యస్థ ఫలితాలను పొందుతారు. వివాదాలలో తలదూర్చకపోవడమే మంచిది. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

horoscope today in telugu 24th july 2023
horoscope today in telugu 24th july 2023

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారు బంధు మిత్రుల సహకారంతో ఆయా రంగాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. శత్రువుపై విజయం సాధిస్తారు. అభివృద్ధి పనుల్లో ముందడుగు వేయండి. ఆకస్మిక ధనలాభం ఉంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించను. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Aquarius

ఈ రాశి వారు ఈరోజు ఎటువంటి అడ్డంకులు ఎదురైనా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 24, 2023 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన విషయాలలో ఆర్థిక పురోగతిని సాధిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న పని వెంటనే పూర్తవుతుంది. అందరినీ కలుపుకుపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News