Homehoroscopehoroscope today in telugu : 28-07-2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu : 28-07-2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, july 28, 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Aries horoscope

ఈ రాశి వారు తమ పై అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి . బంధు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Taurus horoscope

ఈ రోజు ఈ రాశి వారు తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడమే కాకుండా ప్రశంసలు కూడా పొందుతారు. వృత్తి, విద్య, వైద్య రంగాలలోని వారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Gemini

ఈ రోజు ఈ రాశి వారు అందరినీ కలుపుకొని పనిచేస్తారు . ఏ పని చేసినా అది పూర్తవుతుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవడం మంచిది. స్థిర నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.

horoscope today in telugu

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Cancer horoscope

ఈ రోజు ఈ రాశి వారు బంధువులు మరియు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఇతరుల సహకారంతో ముందుకు సాగుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

-Advertisement-

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Leo

ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఖర్చులు ఎక్కువ. చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. స్వీయ నిర్ణయం పనిచేయదు. ఇతరుల నుండి సలహా తీసుకోండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Virgo

ఈ వ్యక్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మంచి పనులు చేసే అవకాశం ఉంది. బంధుప్రీతి ఎక్కువ. కుటుంబ సభ్యుల సూచనలు మంచి చేస్తాయి. గొప్ప వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

today horoscope

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Libra horoscope

ఈ రోజు ఈ రాశి వారు అవసరానికి డబ్బు సంపాదిస్తారు. పని లో ఇతరుల సహాయం పొందే అవకాశం ఉంది. ఏ పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో కలసి ముందుకు సాగుతారు. అధిక ఒత్తిడిని అధిగమిస్తారు. ఇంకా ప్రయాణాలు కూడా చేస్తారు.వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Scorpio

ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు లేకుండా చూసుకోవడం మంచిది. లక్ష్యాలను చేరుకోవాలంటే కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వాలి. చేపట్టిన పనుల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఉత్సాహంగా ముందుకు సాగండి. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Saggitarius

ఈ రోజు ఈ రాశి వారు చేపట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. వృత్తి, విద్య, ఉద్యోగాలలో ఆర్థికాభివృద్ధి పొందుతారు. శుభవార్త వింటారు. అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

horoscope today in telugu

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Capricorn horoscope

ఈరోజు ఈ రాశి వారు అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. శుభవార్త వింటారు. ఇతరుల సహకారంతో ముందుకు సాగే అవకాశం ఉంది.వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Aquarius

ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. బంధు మిత్రుల సహకారంతో ఆయా రంగాలలో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. మానసిక ధైర్యంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతారు.ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశంఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 28, 2023 Pisces horoscope

ఈ రోజు ఈ రాశి వారు తగిన ప్రశంసలు అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మీరు ప్రారంభించిన పనులలో కూడా మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

also read :

Red Alert in Telangana : జల దిగ్భంధంలో పలు జిల్లాలు.. మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు..

Trains Cancelled : వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. ఏయే రైళ్ళంటే ?

viral video : షూటింగ్‌ చూడ్డానికి వచ్చిన చిరుత.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News