Homehoroscopehoroscope today in telugu : 27-07-2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu : 27-07-2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, july 27, 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Aries horoscope

ఈ రాశి వారు కాస్త చిరాకుగా ఉంటారు. ఖర్చు ఎక్కువ. మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వివాదాలను నివారించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శుభఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Taurus horoscope

మీరు ఈరోజు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ సభ్యులతో చర్చలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Gemini

ఈరోజు ఖర్చులు అధికం. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటాయి. పని ఒత్తిడి కారణంగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి పనిలో జాగ్రత్త వహించడం మంచిది. రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసంవైపు వెళ్లకుండా ఉంటే గౌరవ దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్యబాధలు అధికమవుతాయి.

horoscope today in telugu

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Cancer horoscope

ఈ రోజు మీకు విశ్రాంతి దొరుకుతుంది. డబ్బు చాలా ఖర్చు అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు మంచిదే. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

-Advertisement-

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Leo

మీరు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శత్రువుతో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు ఒత్తిడి అధికం. వ్యాపారులకు ఇబ్బందికరమైన రోజు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసేపనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Virgo

ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. చాలా ప్రయాణాలు చేస్తారు. స్త్రీ సౌఖ్యం లభించే అవకాశం ఉంది. శత్రువులపై విజయాన్ని ఆనందిస్తారు.కళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు.

today horoscope

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Libra horoscope

ఈరోజు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది.. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో చర్చలకు దూరంగా ఉండటం మంచిది. మంచి ఫలితాలు రావాలంటే ఈరోజు దక్షిణామూర్తిని పూజించాలి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Scorpio

ముఖ్యమైన పనులన్నీ ఈరోజు పూర్తవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇష్టమైన వాటి కోసం ఖర్చు ఎక్కువ చేస్తారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Saggitarius

ఈరోజు మీకు చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంలో చికాకులు, శారీరక శ్రమ, ఖర్చులు పెరుగుతాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటేనే మంచిది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.

horoscope today in telugu

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Capricorn horoscope

ఈరోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంత మంచిది. చికాకులు ఎక్కువ. కీర్తి పెరగడం వల్ల సంతోషంగా ఉంటారు. శత్రువులతో వ్యవహరించడంలో మరియు వృత్తిపరమైన వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి.ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Aquarius

ఈరోజు మీ కుటుంబ సభ్యుల పట్ల మర్యాదగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదు.అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 27, 2023 Pisces horoscope

ఈరోజు శారీరకంగా ఉల్లాసంగా ఉంటుంది. ఆందోళనలు తగ్గుతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఖర్చు తగ్గడం వల్ల వారు సంతోషంగా ఉంటారు. బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు.

also read :

Devotional: శంఖం సంపదకు ప్రతిరూపం.. ఎలా పూజించాలంటే..

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News