Horoscope Today, 19 july 2023: Check astrological prediction for your signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Aries horoscope
ఈ రాశి వారు బంధుమిత్రులతో ప్రత్యేక సమయం గడుపుతారు. అమ్మగారి తరపు నుండి ధనలాభం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ, కార్యాలయాలలో వ్యక్తులు ఉత్సాహంగా పని చేస్తారు మరియు వారి పనులకు కట్టుబడి ఉంటారు. ఇతరులకు ఇబ్బంది లేదా అసౌకర్యం కలిగించే చర్యలను నివారించడం చాలా ముఖ్యం. సంకల్పం, పట్టుదలతో కెరీర్‌లో సవాళ్లను అధిగమించవచ్చు. అయినప్పటికీ, ఊహించని ప్రతికూల ఫలితాలను నివారించడానికి జాగ్రత్త వహించడం మరియు వారి చర్యలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Taurus horoscope
ఈ రాశి వారు దేహాలంకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.ఉద్యొగస్తులు వారి పనితనాన్ని చూపి ప్రశంసలు పొందుతారు. మీకు రోజు అంత బాగుండదు. అనేక విషయాలపట్ల వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Gemini
ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూలంగా ఫలితాలని కలుగ జేస్తుంది. సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతికూడా అందుకుంటారు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Cancer horoscope
ఈరోజు దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు ఎక్కువ ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. ఇంటికి తిరిగివస్తున్నప్పుడు మీవాహనాన్ని జాగ్రతగా నడపాలి,లేనిచో ప్రమాదాల బారిన పడతారు. కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Leo
ఈరోజు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. కుటుంబంతో- పిల్లలలు, స్నేహితులతో కలిసి సరదా సమయం గడుపుతారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Virgo
ఈరోజు బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో ఇల్లు విడిచిపెట్టినప్పటికీ, విలువైన వస్తువును పోగొట్టుకున్న దురదృష్టకరమైన అనుభవం నిరుత్సాహపరుస్తుంది. అయితే, ఎదురుదెబ్బలు జీవితంలో సహజమైన భాగమని గుర్తుంచుకోవాలి. నిరాశ గురించి ఆలోచించే బదులు, ఆశావాదాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి మరియు పరిష్కారాన్ని కనుగొనడం లేదా అనుభవం నుండి నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. కొన్నిసార్లు, ఊహించని పరిస్థితులు వ్యక్తిగత ఎదుగుదలకు దారితీయవచ్చు లేదా కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Libra horoscope
ఈ రాశి వారికి. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మీ సృజనాత్మకత నైపుణ్యాలు, సరిగ్గా వాడుకుంటే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి వస్తుంది. కొత్తకార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరిత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధువులు మరియు స్నేహితులతో విభేదాలను నివారించడం మంచిది. సంఘర్షణలలో పాల్గొనడం బంధాలను దెబ్బతీస్తుంది మరియు ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Scorpio
ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. మీ వైవాహిక జీవతంలో ఏర్పడ్డ సమస్యల వలన మీకు ఆందోళన, కలగించవచ్చును. వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోందని అర్దమవుతుంది. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Saggitarius
ఈరోజు అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. మీ భవిష్యత్ తరాలు మీ బహుమతిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అర్థం చేసుకునే స్నేహితుని కలవడం సంతోషంగా అనిపిస్తుంది. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Capricorn horoscope
ఈ రాశి వారికి అనారోగ్య బాధలు ఉండవు. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. మీకున్న తెలివితేటలతోను మీకు కావల్సిన వారి ప్రేమ పొందుతారు. మూడోవ్య్తక్తి మాటలను నమ్మకుండా ఉండడం మంచిది. బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధిమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Aquarius
ఈరోజు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలు ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రియమైనవారి మధ్య తలెత్తే వివాదాల గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. విభేదాలు పెరగకుండా నిరోధించడానికి మీ ప్రియమైనవారితో బహిరంగంగా మరియు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. మీ ప్రియమైనవారితో ఆరోగ్యకరమైన కనెక్షన్‌లను పెంపొందించుకోండి. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము గడపడం వలన సంతోషంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 19, 2023 Pisces horoscope
ఈరోజు సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమికురాలిని నిరాశ పరచొద్దు. ఆమెని నిరాశపరిస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి. అనుకోని అతిధి ఇంటికి రావటముచేత కొంత ఇబ్బందిపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE