Horoscope Today, 13th july 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Aries horoscope
ఈ రాశి వారికి ఈరోజు అంతా శుభమే జరుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడం వల్ల సంతోషం కలుగుతుంది. భవిష్యత్తు కోసం కొంత మొత్తం పొదుపు చేస్తారు. మిత్రులతో అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. కొత్త పనులకు ఆటంకాలు ఎదురైనా మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార రంగాలలో ధననష్టం రాకుండా జాగ్రత్తపడాలి. బంధుమిత్రుల సహాయ, సహకారాల కోసం ఎదురుచూస్తున్నారు. దైవ దర్శనం లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Taurus horoscope
ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు.. మీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. వ్యాపారస్తులు ఈరోజు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకుంటారు అలాగే మంచి విజయాన్ని సాధిస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. సంపద అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో మార్పులు సంతృప్తినిస్తాయి. బంధువులు, స్నేహితులను కలుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Gemini
ఈ రాశివారు మిత్రులతో చర్చించి వారి సహకారం పొందుతారు.. వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇన్సూరెన్స్ లేదా పెట్టుబడికి సంబంధించిన ఏదైనా ప్లాన్ చేస్తుంటే, ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త వస్తువులు, వస్త్రాలు, వాహనాలు, ఆభరణాలతో లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్త వింటారు. శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Cancer horoscope
ఈ రాశి వ్యక్తులు అనేక కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. మీ మంచి ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. మీరు కొత్త ఆలోచనల యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు మరియు మంచి ఆర్థిక విజయాన్ని పొందుతారు. తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సకాలంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిన్న చిన్న విషయాలకే మానసికంగా ఆందోళన చెందుతారు. ప్రొఫెషనల్‌గా ఉండటం మంచిది. సహనం ఎల్లప్పుడూ మంచిది. కోపం వల్ల కొన్ని విషయాలు చెడిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Leo
ఈ రాశివారు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. పెద్దల అభిప్రాయాలను తప్పకుండా పాటించాలి. అవివాహితులకు వివాహానికి సంబంధించిన ప్రతిదీ శుభప్రదం. బంధువులు, స్నేహితులను కలుస్తారు. కొత్త ఇంటి నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభాలతో అప్పులు తొలగుతాయి. శత్రువులు తొలగిపోతారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Virgo
ఈ రాశి వారు ఈరోజు అదృష్టవంతులు. ఈరోజు మీరు ఆస్తులను కొనవచ్చు లేదా అమ్మవచ్చు. మీ పెండింగ్‌లో ఉన్న పనులను తిరిగి ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. పార్టీలు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మానసికంగా కలవరపడుతున్నారు. కుటుంబంలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి అడ్డంకులు ఉంటాయి. ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Libra horoscope
ఈ రాశి వారు మీ ప్రతిభతో ప్రజలను ఆకర్షిస్తారు. ఏదైనా పని చేసే ముందు ముఖ్యమైన పనులు చేయాలి. అప్పుడే మంచి విజయం సాధిస్తారు. మరోవైపు, వాస్తవాలను అంచనా వేయడం మరియు ఆర్థిక ప్రణాళికను రూపొందించడం మంచిది. ఇతరులు మీ మంచి ప్రవర్తనను అనుకరిస్తారు. అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆభరణాలు, వస్తు, వస్త్రాలు పొందుతారు.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Scorpio
ఈ రాశి వారికి ఈరోజు శుభదినం. మీరు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు. వ్యాపారస్తులకు ఈరోజు వారి పిల్లల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కళాకారులు ఈరోజు మంచి విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన నష్టానికి అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. మిమ్మల్ని తప్పుదారి పట్టించే వారి మాట వినవద్దు. క్రీడాకారులు, రాజకీయ రంగాలలో ఉన్నవారు మానసికంగా కలవరపడక తప్పదు. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Saggitarius
ఈ రాశి వారు కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. మీరు చేసే కొత్త ఒప్పందాలు మంచి లాభాలను తెస్తాయి. ముఖ్యమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 100 శాతం అదృష్టం ఉంటుంది. సానుకూల స్థానభ్రంశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో మార్పు కావాలి. ఇతరుల విమర్శలకు గురవుతారు. గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Capricorn horoscope
కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు రావడమే కాదు.. ఉన్నత స్థానానికి కూడా చేరుకుంటారు.. జీవిత భాగస్వామి పేరుతో చేసే పనులు సత్ఫలితాలను అందిస్తాయి.. స్థిరాస్తితో సంబంధం ఉన్నవారు మంచి విజయం సాధిస్తారు. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. సానుకూల స్థానభ్రంశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆభరణాలు, వస్తు, వస్త్రాలు పొందుతారు
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Aquarius
ఈ రాశి వారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామి అభిప్రాయం తీసుకోవడం మంచిది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. నిత్యావసర వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యం కారణంగా బలహీనంగా ఉంటారు. అధికార భయం. ప్రయాణాలు వాయిదా వేయవలసి వస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 13, 2023 Pisces horoscope
ఈ రాశి వారు చాలా ప్రయోజనాలను పొందుతారు. పనికి సంబంధించిన విషయాలలో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. మీరు బృందంతో కలిసి పని చేయడం వలన మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆకస్మిక లాభం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తి. పేరు ప్రతిష్టలు పొందుతారు. సంఘంలో గౌరవం ఉంది. అంతటా అనుకూల వాతావరణం నెలకొంది. స్త్రీలకు శుభం కలుగుతుంది. బంధువులు, స్నేహితులు కలుస్తారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE