HomedevotionalHoroscope Today : 07-10-2022 శుక్రవారం మీ రాశి ఫ‌లాలు..

Horoscope Today : 07-10-2022 శుక్రవారం మీ రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today:

07-10-2022 శుక్రవారం రాశి ఫ‌లాలు..

మేషం : ఈ రాశుల వారికి చేసే ప్ర‌తి ప‌నిలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ప్ర‌తికూల ప‌రిస్థితులుని ఎదుర్కొనేలా ఉండాలి. కీల‌క‌మైన విష‌యంలో కుటుంబ స‌భ్యుల స‌హకారం తీసుకోవ‌డం మంచిది. ప్రార్ధ‌న‌ల వ‌ల‌న శుభాలు జ‌రుగుతాయి.

వృష‌భం : ఈ రాశుల వారు ధృడంగా ఉంటారు. ఫ్రెండ్స్, బంధువుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కీలక విషయాలు, వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు అందుకునే అవ‌కాశం ఉంది

మిథునం
ఈ రాశి వారికి శారీరక శ్రమ పెరగవచ్చు. బంధువులతో కలహా సూచనలు క‌లగొచ్చు. అనవసర ధనవ్యయంతో ఇబ్బందులు పడే అవ‌కాశం ఉంది. ఇక ఇష్ట దైవాన్ని కొల‌వ‌డం వ‌ల‌న మంచి ఫ‌లితాలు అందుకుంటారు.

కర్కాటకం : ఈ రాశి వారికి మొహ‌మాటం వ‌ల‌ర కొన్ని విషయాల్లో తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభం త‌ప్ప‌క‌ కలుగుతుంది.

సింహం : చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. వృత్తి, ఉద్యోగ, వ్యాపార తదితర రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకునే అవ‌కాశం ఉంది. ఇష్టదైవారాధన మాత్రం ఏ మాత్రం మ‌ర‌వొద్దు.

-Advertisement-

Horoscope Today

కన్య : కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురు కావ‌డం వ‌ల‌న ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరి ప్రవర్తన వ‌ల‌న ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది. మానసికంగా మరింత ధృఢంగా ఉండాలి. గణపతి స్తోత్రం పఠించడం వల్ల మేలు క‌లుగుతుంది.

తుల : కొన్ని వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఎదురయిన‌ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అలసట, ఖర్చులు పెరుగడంతో ప్రతి కూల ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశం ఉంది.

వృశ్చికం : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏదో ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే అన్ని శుభాలు క‌లుగుతాయి.

ధనస్సు : సమాజంలో ఈ రాశి వారికి కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కీలక విషయాలు, వ్యవహారాల్లో బంధు, మిత్రుల సహకారం త‌ప్ప‌క ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో అధికారుల ప్రశంసలు అందుకోవ‌డమే కాక‌, సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవ‌కాశం ఉంది.

మకరం : కీలక విషయాలు, వ్యవహారాల్లో కుటుంబీకులు, పెద్దల సలహాలు, త‌ప్ప‌క తీసుకోవాలి. వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో మీరు పాల్గొంటారు.. అనవసర ధనవ్యయంతో ఇబ్బందులు త‌ప్ప‌క క‌లుగుతాయి.

కుంభం : కుటుంబీకులు, బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కొన్ని పనుల్లో అలసత్వం వల్ల ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బందులు అయిన తొల‌గిపోతాయి.

మీనం : ఈ రాశివారు స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు.శివారాధన చేయడం వల్ల ఎన్నో శుభాలు క‌లుగుతాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News