Homedevotionalhoroscope today telugu: సోమవారం ఈ రోజు రాశి ఫలాలు 9-1-2023

horoscope today telugu: సోమవారం ఈ రోజు రాశి ఫలాలు 9-1-2023

Telugu Flash News

Horoscope Today, 9th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారు ఆదాయంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. గృహ, వాహనాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొన్ని పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది.. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

వృషభం

ఈ రాశి వారికి అపార్ధాల కారణంగా కొందరు బంధువులు దూరమవుతారు. ఆర్థికంగా స్థిరత్వం లభించే సూచనలు ఉన్నాయి. పొదుపు సూత్రాలు ఎక్కువ‌గా పాటిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ ఏర్ప‌డుతుంది. విద్యార్థులకు సునాయాసంగా విజయాలు లభిస్తాయి.

మిథునం

ఈ రాశి వారికి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఐటీ, క్రీడలు, స్వయం ఉపాధి, రియల్ ఎస్టేట్ వంటి రంగాలవారు అద్భుతంగా రాణిస్తారు.. ఇతరులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు ఎంతో శ్రమ మీద విజయాలు సాధించే అవ‌కాశం ఉంది.

కర్కాటకం

ఈ రాశా వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసుకోవ‌డం మంచిది. ఆదాయపరంగా స్థిరత్వం ఏర్ప‌డుతుంది.. ఆస్తుల విలువ కొద్దిగా పెరిగినట్టు సమాచారం పొందుతారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు.

horoscope today in teluguసింహం

ఈ రాశి వారు పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వ‌స్తుంది.. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఏర్ప‌డుతుంది.. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంది.. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

-Advertisement-

కన్య

ఈ రాశి వారు కుటుంబ సమస్య నుంచి అనుకోకుండా బయటపడతారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీగా ఉంటారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవ‌డం మంచిది. శరీరానికి విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొద్దిగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.

తుల

ఈ రాశికి సంబంధించిన‌ అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇతరులకు మాత్రం సహాయం చేయ‌గ‌లుగుతారు.. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు అని అనిపిస్తుంది.

వృశ్చికం

ఈ రాశి వారు అనారోగ్యం మీద ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది.. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

ధనుస్సు

ఈ రాశి వారు ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. తోబుట్టువులకు వీలైనంతగా ఎక్కువ‌గా సహాయం చేస్తారు. మీ దగ్గర నుంచి సహాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. విద్యార్థులు ఆశించిన స్థాయిలో పురోగతి పొందుతారు.

మకరం

ఈ రాశి వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించ‌డం మంచింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగానే ఉంటుంది.

కుంభం

ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది ప‌డే ఛాన్స్ ఉంది. వ్యాపార భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించండి. స్నేహితులతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది.. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది..

మీనం

ఈ రాశి వారికి సంబంధించి మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు ఎక్కువ‌గా చేస్తారు. ఉద్యోగ పరంగా శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు పెద్ద‌గా ప్రయోజనం కలిగించవు.

also read:

Surendran K Patel : సాధారణ బీడీ కార్మికుడి నుంచి టెక్సాస్ లో జడ్జి స్థాయికి…

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ స్థానం మార‌నుందా.. ఫినిష‌ర్‌గా పంపాల‌నే ఆలోచ‌న‌లో ముంబై ఇండియన్స్

‘అతను చాలా త్వరగా చనిపోతాడు’ పుతిన్ ఆరోగ్యంపై ఉక్రెయిన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News