Homedevotionalhoroscope today telugu: 8-1-2023 ఆదివారం ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today telugu: 8-1-2023 ఆదివారం ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 8th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Aries horoscope

ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ఇతరులపై పర్యవేక్షణ వంటివి అప్పజెప్పే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Taurus horoscope

ఈ రాశి వారు అనవసర ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. ఆదాయంలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యంతో స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు.

మిథునం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Gemini

ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా కాస్తంత పుంజుకునే ఛాన్స్ ఉంటుంది.. పొదుపు సూత్రాలు పాటిస్తారు. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేసే ఛాన్స్ ఉంది.. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

కర్కాటకం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Cancer horoscope

ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను ప్రశాంత వాతావరణం ఏర్ప‌డుతుంది.. స్నేహితుల కారణంగా కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేసే ఛాన్స్ ఉంది.

horoscope 2023సింహం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Leo

ఈ రాశి వారికి అధికారుల నుంచి, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేసే ఛాన్స్ ఉంది. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థిక సమస్యలు త‌లెత్తుతుంది.

-Advertisement-

కన్య – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Virgo

ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఏర్ప‌డుతుంది.. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. కొందరు మిత్రులకు అండగా నిల‌బ‌డే ఛాన్స్ ఉంది.

తుల – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Libra horoscope

ఈ రాశి వారికి అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. బదిలీకి అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి ఇది మంచి సమయం కాదు. తోబుట్టువులకు సహాయం చేస్తారు. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండ‌డం మంచిది.

వృశ్చికం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Scorpio

ఈ రాశి వారు చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఖర్చుల్ని అదుపు చేసుకుంటే మంచిది. ఉద్యోగపరంగా అధికారుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనస్సు – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Saggitarius

ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు చక్కబడతాయి. బంధువులతో అపార్ధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగకుండా ఉండాలి.

మకరం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Capricorn horoscope

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో దుబారా చేయ‌రాదు. పొదుపు ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పెళ్లి ప్రయత్నంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Aquarius

ఈ రాశి వారు లౌకిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్త‌మం. ఉద్యోగం మారటానికి ఇది స‌రైన సమయం కాదు. పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 8, Pisces horoscope

ఈ రాశి వారు ఉద్యోగంలో ఆవేశ కావేశాలకు దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది స‌రైన‌ సమయం కాదు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవ‌డం మంచిది. కొందరు మిత్రుల వల్ల అపనిందలు పడాల్సి వస్తుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం కుదుట ప‌డుతుంది.

also read : 

Waltair Veerayya Official Trailer | వాల్తేర్ వీరయ్య తెలుగు ట్రైలర్

Kannada Movie Kranti Official Trailer | ಕ್ರಾಂತಿ ಚಿತ್ರದ ಟ್ರೈಲರ್ | క్రాంతి ట్రైలర్

Joshimath sinking : జోషిమఠ్‌ మునిగిపోతుందా..? చరిత్రలో మరో ద్వారకా అవుతుందా..?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News