Homedevotionalhoroscope today : 31-10-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 31-10-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 31th October 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : October 31, 2022 Aries horoscope

ఈ రాశి వారికి విదేశీయాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : October 31, 2022 Taurus

ఈ రాశి వారికి అనారోగ్య బాధలు వేధిస్తాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం క‌లుగుతుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అనవసర వ్యయప్రయాసలు చేయ‌కుండా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : October 31, 2022 Gemini

ఈ రాశి వారు చేసే ప్ర‌య‌త్నాలకి ఆటంకాలు క‌లుగుతాయి. లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు ఎక్కువ‌.. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమించి లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : October 31, 2022 Cancer horoscope

కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది.. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించటానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. . పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

horoscope on diwaliసింహ రాశి ఈరోజు ఫలితాలు : October 31, 2022 Leo

ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలయత్నం చెందుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన ఎక్కువ అవుతుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

-Advertisement-

కన్య రాశి (Virgo) ఈరోజు ఫలితాలు : October 31, 2022

అద్భుతమైన అవకాశాలు వ‌స్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందడంతో ఆనందం పొందుతారు

తుల రాశి (Libra) ఈరోజు ఫలితాలు : October 31, 2022 horoscope

ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు తొల‌గిపోతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా క‌లుగుతాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం చేయాల్సి ఉంది.

వృశ్చిక రాశి (Scorpio) ఈరోజు ఫలితాలు : October 31, 2022

ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రల‌కు ప్రయత్నిస్తారు. దైవదర్శనం కూడా క‌లుగుతుంది.

ధనస్సు రాశి (Saggitarius) ఈరోజు ఫలితాలు : October 31, 2022

స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి ఎక్కువ వ‌హించాలి. అపకీర్తి వచ్చే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉంటే మంచిది.. పరిశుభత్రకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు క‌లుగ‌వు.

మకర రాశి (Capricorn) ఈరోజు ఫలితాలు : October 31, 2022 horoscope

గృహంలో మార్పులు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహం క‌లుగుతుంది . స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫ‌లించ‌వు. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. .

కుంభ రాశి (Aquarius) ఈరోజు ఫలితాలు : October 31, 2022

ప్రయత్నకార్యాలన్నీ ఫ‌లించ‌డంతో సంతోషం క‌లుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందే అవ‌కాశం ఉంటుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్ల‌డం మంచిది.

మీన రాశి (Pisces) ఈరోజు ఫలితాలు : October 31, 2022 horoscope

ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందే అవ‌కాశం ఉంటుంది.. ఆకస్మిక ధనలాభం క‌లుగుతుంది.. కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందం పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు క‌లుగుతాయి.

read more:

స‌మంత‌కి సోకిన ‘మయోసైటిస్‌’ డేంజ‌రా.. ఆ వ్యాధి ల‌క్ష‌ణాలేంటి ?

Viral Video: బంపర్ ఆఫ‌ర్.. ఈ రెస్టారెంట్‌లో చేప‌లు ప‌ట్టి వండించుకోవ‌చ్చు.. ఎక్కడ ? ఎలా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News