Horoscope Today, 31st March 2023: Check astrological prediction for your zodiac signs
మేషం:
ఈ రాశి వారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి పాటిస్తారు.. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం ఉత్తమం.. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినట్లయితే అనారోగ్య బాధలు ఏ మాత్రం ఉండవు.
వృషభం:
ఈ రాశి వారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా మంచి సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త లు వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచి చూస్తారు.
మిథునం:
ఈ రాశి వారి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.. వృత్తి ఉద్యోగరంగాల్లో సహనం వహించాలి.
కర్కాటకం:
ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందే ఛాన్స్ ఉంది.. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం అని చెప్పాలి.
సింహం:
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరే ఛాన్స్ ఉంది.. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం అయితే పూర్తవుతుంది.
కన్య:
ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవించే ఛాన్స్ ఉంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల ఏ మాత్రం పనికిరాదు. పగ సాధించే ప్రయత్నం వదిలివేయడం మంచిది.
తుల:
ఈ రాశి వారికి గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. బంధు, మిత్రులు మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది.సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చే పనులు చేస్తారు
వృశ్చికం:
ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల లాభం చేకూరే ఛాన్స్ ఉంది.. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఏ మాత్రం ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందే ఛాన్స్ ఉంది.
ధనుస్సు:
ఈ రాశి వారు కుటుంబంలో చిన్నిచిన్న గొడవల వలన ఇబ్బందులు పడతారు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉంది. . ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు కూడా ఆలస్యంగా లభిస్తాయి.
మకరం:
ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడతారు.. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం ఎంతైన అవసరం.
కుంభం:
ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండటంతో మానసిక ఆనందాన్ని అయితే పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు దక్కుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
మీనం:
ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పనిసరి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను అయితే ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం తప్పనిసరి.
ఇవి కూడా చదవండి :
Chiranjeevi : చంద్రబోస్‌ని సత్కరించిన చిరంజీవి.. ఆయనకొచ్చినంత గర్వంగా ఫీలైన మెగాస్టార్
Samantha : తొలిసారిగా విడాకులపై స్పందించిన సమంత
Rana naidu: బూతుల ఎఫెక్ట్‌తో రానా నాయుడు విషయంలో నెట్ ఫ్లిక్స్ సంచలన నిర్ణయం
Sarath Babu : ఆసుపత్రిలో శరత్ బాబుకి చికిత్స.. ఏం జరిగింది..!
dasara telugu movie review : ‘దసరా’ తెలుగు మూవీ రివ్యూ