Horoscope Today:
మేషం:
ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బంధువుల నుంచి ఎలాంటి సహకారం ఆశించకపోవడం మంచిది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండడం వలన మీరు ఉత్సాహంగా ఉంటారు. చీమలకు పిండి తినిపించడం వలన పరిహారం కలుగుతుంది.
వృషభ రాశి :
ఈ రాశి వారు పరిష్కారాలని పరిష్కరించుకుంటారు. ఆటంకాలు స్నేహితుడిపై అనుమానం కలిగించేలా చేస్తాయి.. అపరిచితులతో పరిచయం పెంచుకోకపోవడం మంచిది. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురు అవుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉండడంతో మీరు కొంత నిరుత్సాహంతో ఉంటారు.
మిథున రాశి :
ఈ రాశి వారి కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది. పిల్లల చదువు లేదా వృత్తి గురించి కొంత ఆందోళన ఎక్కువ అవుతుంది. సామాజిక కార్యక్రమాలలో పని చేస్తున్నప్పుడు ప్రతికూల కార్యకలాపాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది.
కర్కాటక రాశి :
మీ కుటుంబ సభ్యుల వివాహాల వల్ల సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది.. అనవసర ఖర్చులను కూడా తగ్గించుకోండి. విద్యార్థులు, యువత తమ కెరీర్‌కు సంబంధించిన కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి.
సింహ రాశి :
ఈ రాశి వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యులు వ్యాపార గందరగోళం, ఆర్థిక మందగమనం కారణంగా ఖర్చులని తగ్గించుకునే ప్రణాళిక చేసుకోవాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది. 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
కన్య రాశి :
బంధువులతో ఆర్ధికపరమైన విషయాలు గురించి చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. వైవాహిక జీవితంలో ప్రేమగా ఉండాల్సి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండాలి.
తుల రాశి :
ఈ రాశి వారు ధార్మిక, ఆధ్యాత్మిక పనులకు సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం ఎల్లప్పుడూ మీతోనే ఉండడం వలన సంతోషంగా ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారిలో ఉండే దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోతాయి. భూమి కొనుగోలుకు సంబంధించిన పనిలో లాభం ఆశించకుండా ఉండడం మంచిది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండే అవకాశం ఉంది
ధనస్సు రాశి:
మతపరమైన సంస్థల్లో ఈ రాశి వారు ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు అధికారులతో సత్సంబంధాలు కొనసాగే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో వినోదాలలో గడుపుతారు. ఈరోజు అత్యంత కాలుష్యం రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి
మకర రాశి :
ఈ రాశి వారికి ఉన్న తెలివితేటలు, సామర్థ్యాలను అందరూ మెచ్చుకుంటారు. మీ భాగస్వామ్య సంబంధిత వ్యాపారంలో సమన్వయం ఉండడం మీకు కలిసి వస్తుంది. ఒక విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిన అవి చక్కదిద్దుకుంటాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కుంభ రాశి :
ఈ రాశి వారికి ఏ సమస్య వచ్చినా సంభాషణ ద్వారా పరిష్కారం కనుగొంటారు. వ్యాపార కార్యకలాపాలలో కొన్ని సమస్యలు ఉండొచ్చు, దాని వలన చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలసట, ఒత్తిడి వంటివి మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
మీన రాశి :
ఈ రాశి వారు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సన్నిహితుల గురించి అసహ్యకరమైన వార్తలు రావడం వల్ల మీరు చాలా బాధపడతారు. వ్యాపారులకు ఈరోజు వ్యాపార సంబంధిత ప్రాజెక్టు విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.