Horoscope Today, 29th april 2023: Check astrological prediction for your zodiac signs
మేషం :
ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో తలకు మించిన బాధ్యతలు ఏర్పడతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. . పిల్లల నుంచి శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. మిత్రులతో విభేదాలు సమసిపోవడం జరుగుతుంది. ఉద్యోగం మారటానికి ఇది సరైన సమయం కాదు.
వృషభం :
ఈ రాశి వారు కొన్ని ఆర్థిక అవసరాలు తీర్చుకుంటారు. ఉద్యోగ పరంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
మిథునం :
ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారుల నుంచి కొంత ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
కర్కాటకం:
ఈ రాశి వారికి అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. పిల్లలతో సరదాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది.. ఉద్యోగంలో సహచరుల కారణంగా ఒకటి రెండు సమస్యలు ఇబ్బందులు తలెత్తుతాయి.. తోబుట్టులతో అపార్ధాలు తలెత్తే ఛాన్స్ ఉంది.. ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉంటుంది.
సింహం :
ఈ రాశి వారి వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది.. కొత్త నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టకుండా ఉంటే ఉత్తమం. ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను, ఆర్థికంగానూ సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
కన్య :
ఈ రాశి వారి కుటుంబ వాతావరణం, ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. పనిచేసే చోట గౌరవ మర్యాదలు క్రమంగా పెరుగుతాయి. పలుకుబడి కలవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంది.
తుల :
ఈ రాశి వారు ఊహించని విధంగా శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.తోబుట్టువులతో విభేదాలు తలెత్తుతాయి.. ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం చేస్తే మంచిది. ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సహాయం చేసి ప్రశంసలు అందుకుంటారు.
వృశ్చికం :
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది.. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
ధనుస్సు :
ఈ రాశి వారు కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేసి ఇబ్బంది పడతారు. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఒక్క నిమిషం కూడా తీరిక లేని స్థితిలో ఉంటారు.
మకరం :
ఈ రాశికి చెందిన వారు శుభవార్తలు వింటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి రావడం వలన సంతోషంగా ఉంటారు.. బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కుంభం :
ఈ రాశికి చెందిన వారికి కుటుంబంలో అనుకోకుండా పిల్లల వల్ల సమస్యలు తలెత్తుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చేయండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మీనం :
ఈ రాశి వారి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. డబ్బు సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చు. ఆర్థిక సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి సమయం మంచిగానే ఉంటుంది. డాక్టర్లు లాయర్లు ఐటి వారు పురోగతి సాధిస్తారు. చదువుల్లో పిల్లలు ముందడుగు వేసే అవకాశం ఉంది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE
also read :
‘Ponniyin Selvan 2′ Review :’పొన్నియన్ సెల్వన్ 2’ తెలుగు మూవీ రివ్యూ
Agent Telugu Movie Review : ‘ఏజెంట్’ తెలుగు మూవీ రివ్యూ