Horoscope Today, 29th january 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Aries horoscope
ఈ రాశి వారికి రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Taurus horoscope
ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల కొంత బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Gemini
ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేరుతుంది.. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధించే ఛాన్స్ ఉంది.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Cancer horoscope
ఈ రాశి వారికి మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు ఎంతో సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Leo
ఈ రాశి వారికి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే ఛాన్స్ ఉంది.. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవసరం. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోతాయి.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Virgo
ఈ రాశి వారు బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలుకూడా దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Libra horoscope
ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో ఎంతో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోయి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Scorpio
ఈ రాశి వారికి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రుల చేత గౌరవింపచబడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Saggitarius
ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుచే ఛాన్స్ ఉంది.. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Capricorn horoscope
ఈ రాశి వారికి బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను కొంత ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కొంత కాలం గడుస్తుంది.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Aquarius
ఈ రాశి వారు ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో కొంత మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవసరం. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 29, Pisces horoscope
ఈ రాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోవల్సి వస్తుంది.
also read:
heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..
Foods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..
Dry Fruits Health Benefits : పోషకాలకు నిలయం డ్రై ఫ్రూట్స్
Curry Leaves Health Benefits: ఆరోగ్య ప్రదాయిని.. కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలివే..!