Homedevotionalhoroscope today telugu : 28‌‌‌‌‌-12-2022 బుధవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

horoscope today telugu : 28‌‌‌‌‌-12-2022 బుధవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 28‌‌‌‌‌th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Aries horoscope

ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకునే ఛాన్స్ ఉంది.. చేపట్టిన పనులు సక్సెస్ అయ్యే విధంగా నిర్ణయాలను తీసుకుంటారు. ధనధాన్య లాభాలు కలిగే అవకాశం ఎక్కువ‌.. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం సానుకూలంగానే ఉంటుంది.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Taurus

ఈ రోజు ఈ రాశివారు కీలకమైన పనులు పూర్తి చేసి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. అందరితోనూ ప్రేమగా వ్యవహరిస్తారు. కొన్ని నిర్ణ‌యాలు ఆచితూచి తీసుకుంటారు.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు వ‌స్తాయి.. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలోని వారికీ పట్టుదల అవసరం.. ధన యోగం ఉంటుంది.. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయ‌కుండా ఉండ‌డం మంచిది.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు బుద్ధి బలంతో చేసే పనులు ఎంతో శుభఫలితాలను అందిస్తాయి. ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదురైనా కీలక వ్యవహారాల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Leo

ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది.. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఉత్సాహపరిచే సంఘటనలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

-Advertisement-

horoscopeకన్య రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Virgo

ఈరోజు ఈ రాశివారు మాట పట్టింపులకు పంతాలకు పోకుండా కాలం గడపాల్సి వ‌స్తుంది.. సమాజంలో ఓర్పుతో ముందుకు సాగి శుభఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఎవరినీ అతిగా నమ్మకండి.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారికి ఆర్ధికంగా శుభవార్త వింటారు. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో కొంత ఇబ్బందులు పడతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా కాలాన్ని గడపాల్సి ఉంటుంది. భ‌విష్య‌త్‌ ప్రణాళికతో ముందుకు వెళ‌తారు.. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశివారు శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేపడతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేసేందుకు కృషి చేస్తారు.. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆయా రంగాల్లో వారికి అనుకూల ఫలితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Aquarius

ఈ రోజు ఈరాశివారు మానసిక ధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పోత్సాహకర వాతావరణం ఏర్ప‌డుతుంది.. చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : december 28‌‌‌‌‌, 2022 Pisces horoscope

ఈ రాశివారు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది.. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News