Telugu Flash News

Horoscope (27-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today in telugu

Horoscope Today, 27th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారు అకాల భోజనం వల్ల అనారోగ్యంకి గుర‌వుతారు.. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం ఉత్త‌మం. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా మంచిది.

వృషభం

ఈ రాశి వారికి వ్యవసాయ రంగంలో లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోయే అవ‌కాశం ఉంది. చెడును కోరేవారికి దూరంగా ఉండటం ఉత్త‌మం. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహించ‌డం వ‌ల‌న భ‌యాందోళ‌న‌కి గుర‌వుతారు.

మిథునం

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఎక్కువ‌. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమించే ఛాన్స్ ఉంది.. ఈ రోజు మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

కర్కాటకం

ఈ రాశి వారు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ‌. కొంత మానసిక ఆందోళన చెందుతారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదుర‌య్యే ఛాన్స్ ఉంది.

సింహం

ఈ రాశి వారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. దైవదర్శనం చేసుకునే అవ‌కాశం ఉంది.. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోగ‌లుగుతారు.. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను ద‌క్కించుకుంటారు.

కన్య

ఈ రాశి వారికి మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించడం త‌ప్ప‌ని స‌రి. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమయ్యే అవకాశం ఉంది.. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి పొందుతారు.. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.

తుల

ఈ రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు క్ర‌మంగా దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలించే అవ‌కాశం ఉంది. కుటుంబంలో కొంత మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.. రహస్య శతృబాధలు ఎక్కువ‌గా ఉంటాయి.

వృశ్చికం

ఈ రాశి వారికి ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడ ఉత్త‌మం. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవ‌కాశం ఉంది.. తీర్థయాత్రలు ఎక్కువ‌గా చేస్తారు.

ధనుస్సు

ఈ రాశి వారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలుఏర్పడే అవకాశాం కూడా ఉంది.. అనవసర భయానికి ఎక్కువ‌గా లోనవుతారు. వ్యాపారరంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం చాలా అవ‌స‌రం. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధవహించే అవ‌కాశం కూడా ఉంది.

మకరం

ఈ రాశి వారు గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహం చెందే ఛాన్స్ ఉంది.. స్త్రీలతో తగాదాలు ఏర్పడే ఛాన్స్ ఉంది.. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవ‌డం వ‌ల‌న లాభం పొందుతారు.

కుంభం

ఈ రాశి వారికి రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం అవ‌స‌రం. ఇత‌ర వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

మీనం

ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పక ఉంటాయి.. కలహాలకు దూరంగా ఉండటానికి జాగ్ర‌త్త‌లు పాటించాలి. వివాదాలకి దూరంగా ఉండాలి.

also read: 

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

Exit mobile version