Homedevotionalhoroscope today telugu : 27-01-2023 శుక్రవారం రాశి ఫ‌లాలు

horoscope today telugu : 27-01-2023 శుక్రవారం రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 27th january 2023: Check astrological prediction for your zodiac signs

మేష రాశి :

ఈ రాశి వారికి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగములో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. స్త్రీలకు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి.

వృషభ రాశి :

ఈ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఏర్ప‌డ‌తాయి.. ఆరోగ్య విషయాల యందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. అనుకూల ప్రభావం వలన ఉద్యోగ వ్యాపారములయందు కలసి వచ్చును. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం సాధిస్తారు.

మిథున రాశి :

ఈ రాశి వారికి వ్యయస్థానము యందు కుజుని ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. బుధ, గురుల అనుకూలత వలన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. శుభఫలితాల కోసం మిధునరాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించాలి.

కర్కాటక రాశి :

ఈ రాశి వారికి ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్య విషయాల యందు, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. చేసే ప్రతి పని అనుకూలించును

horoscope today in teluguసింహ రాశి :

ఈ రాశి వారు గురుని ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. అన్నింటా సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు.

-Advertisement-

కన్య రాశి :

కన్యరాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉన్నది. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందెదరు. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యారాశి వారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

తులా రాశి :

ఈ రాశి వారికి చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు, కుటుంబమునందు ఏదో ఒక సమస్య వేధిస్తుంది.. స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారు కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, పూజించడం మంచిది.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి.

మకర రాశి :

ఈ రాశి వారికి ఏలినాటి శని వలన పనులయందు ఇబ్బందులు, ఆటంకములు ఏర్పడును. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కుంభ రాశి :

ఈ రాశి వారు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అప్పులు పెరుగును. దశమ స్థానములో రవి, బుధుల ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నములు కలసివచ్చును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఈరోజు విద్యార్థులకు కలసి వచ్చును

మీన రాశి :

ఈ రాశి వారు మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. మీన రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. ఏ ప‌ని చేసిన కూడా అందులో జాగ్ర‌త్త‌లు వ‌హించ‌డం మంచిది.

also read :

Ravi Teja: ర‌వితేజ క‌మ్ బ్యాక్ మాములుగా లేదు.. 2 సినిమాలు 300 కోట్లు

Thyroid : ఈ 5 ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్‌ నుంచి ఉపశమనం గ్యారెంటీ !

Lawyer : కర్ణాటకలో సంచలనం.. లాయర్‌ పేరుతో అతడు చేసే పనులు చూస్తే విస్తు పోవాల్సిందే!

Pope Francis : స్వలింగ సంపర్కంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక వ్యాఖ్యలు.. నేరం కాదు.. పాపం అంటూ..!

Viral Video Today : రోడ్డుపై బుల్లెట్‌ బండితో ఫీట్లు.. ప్రాణాలతో చెలగాటం.. వైరల్ వీడియో

Tollywood News : చిరంజీవి, బాల‌కృష్ణ‌ల భార్య‌ల‌లో ఈ కామ‌న్ పాయింట్ గుర్తించారా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News