HomedevotionalHoroscope Today: 26-09-2022 సోమవారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి ప్ర‌తి కూల ఆలోచ‌న‌లు వ‌స్తాయి

Horoscope Today: 26-09-2022 సోమవారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి ప్ర‌తి కూల ఆలోచ‌న‌లు వ‌స్తాయి

Telugu Flash News

Horoscope Today:

మేషం:

ఈ రాశి వారు వారి కోరిక‌ల‌న్నీ కూడా పిల్లల ద్వారా నెర‌వేర్చుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి కాబ‌ట్టి కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కుటుంబ జీవితంలో వివాదాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. 82 శాతం వ‌ర‌కు అదృష్టం ఉంటుంది.

​వృషభ రాశి :

ఈ రాశి వారు కుటుంబంతోనే ఎక్కువ స‌మ‌యం గడుపుతారు. ఆర్ధిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు అవ‌గాహ‌న వ‌ల్ల‌నే ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి. మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌కు వెళ్ల‌డం వ‌ల‌న మీకు కాస్త ప్ర‌శాంతంగా ఉంటుంది. మ‌న‌స్సులో ప్ర‌తికూల ఆలోచ‌న‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మిథునం:

-Advertisement-

క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితాలు పొందుతారు. నిర్ణ‌యం తీసుకోవ‌డంలో జాగ్ర‌త్త వ‌హించాలి. స్నేహితుడు లేదా బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.. ఆర్థిక పరమైన లావాదేవీల్లో జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించడం మంచిది 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

​కర్కాటక రాశి:

రాజ‌కీయాల్లో ఈ రాశి వారు కాస్త జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. మ‌త‌ప‌ర‌మైన స్థ‌లాలు సంద‌ర్శిస్తారు. పెద్ద‌ల ప్రేమ‌, ఆశీస్సులు ఈ రోజు మీకు ల‌భిస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో మీ ప్రయత్నాలను గట్టిగా చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

​సింహ రాశి :

ఈ రాశి వారు ముఖ్య‌మైన‌ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు ఈరోజు విద్యపై శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక పరమైన సమస్యలు పెరుగుతాయి.రుణాలు తీసుకోవ‌ద్దు. ఇక ఉద్యోగులు ఆఫీసులో త‌మ ప‌నిని జాగ్ర‌త్త‌గా చేసుకోవ‌డం మంచిది.

క‌న్యా రాశి:

ఈ రాశి వారు కమ్యూనికేషన్ సహాయంతో కొత్త విష‌యాల‌కి పరిష్కారం కనుగొంటారు. మధ్యాహ్నం కొన్ని ప్రతికూల వార్తలను పొందుతారు. ప‌నుల్లో ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. 90 శాతం వ‌ర‌కు అదృష్టం ల‌భించ‌నుంది.

​తుల రాశి

ఈ రోజు తుల రాశి వారికి అంతా మంచే జ‌రుగుతుంది. ఆత్మీయుల కలయిక వ‌ల‌న ఈ రోజు సంతోషంగా ఉంటారు. మరోవైపు ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండే అవ‌కాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినమైన నిర్ణయాలు తీసుకోక‌పోవ‌డం మంచిది.

​వృశ్చిక రాశి:

ఈ రాశి వారు నేడు అతిథులు ఆహ్వానించి ఆనందం పొందుతారు. కుటుంబంతో షాపింగ్, వినోదాలకి వెళుతుంటారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ పనిలోనూ విజయం సాధించకపోవడం కాస్త నిరాశ క‌లిగిస్తుంది.

​ధనస్సు రాశి :

ఈ రాశి వారు కోరుకున్న పని పూర్తి అయ్యే అవకాశం ఉంది. యువత ఏదైనా పోటీకి సిద్ధమైతే తప్పకుండా విజయం సాధిస్తారు. సహోద్యోగి లేదా బంధువుతో ఏదో ఒక వాదన మానసిక స్థితిని కొంత డిస్ట్రబ్ చేస్తుంది. మీ బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డంతో కాస్త ఇబ్బందులు ప‌డ‌తారు.

​మకర రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు పాత బకాయిల‌ని అంది పుచ్చుకుంటారు. మీ కలలో ఒకదాన్ని నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం. విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవ‌కాశం ఉంది. 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

కుంభ రాశి:

ఈ రాశి వారు ఇంటి పనులకే స‌మ‌యం ఎక్కువ గడుపుతారు. గత కొన్నేళ్లుగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరకడం కష్టం అవుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

​మీన రాశి :

మీరు మీ శ్రమతో చాలా పనులను పూర్తి చేస్తారు . పిల్లల ప్రవర్తనలో కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఎవరితోనైనా భాగస్వామ్యం పెట్టుకోవ‌డం మంచిది. 60 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News