Homedevotionalhoroscope today: అక్టోబర్ 26, బుధవారం ఈ రోజు రాశి ఫలాలు 2022

horoscope today: అక్టోబర్ 26, బుధవారం ఈ రోజు రాశి ఫలాలు 2022

Telugu Flash News

horoscope today, 26th October 2022: Check astrological prediction for your zodiac signs

October 26, 2022 horoscope మేష రాశి ఈరోజు ఫలితాలు

ఈ రాశి వారు కొంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున మాట విష‌యంలో జాగ్ర‌త్త త‌ప్ప‌నిస‌రి. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తతగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు.

October 26, 2022 వృషభ రాశి ఈరోజు ఫలితాలు

శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు త‌ప్ప‌క‌ వింటారు. గౌరవ, మర్యాదలు ఎక్కువ అవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది.

October 26, 2022 horoscope మిధున రాశి ఈరోజు ఫలితాలు

బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం అవ‌స‌రం. అకాల భోజనం వల్ల అనారోగ్యానికి గుర‌వుతారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది కాబ‌ట్టి జాగ్రత్త అవ‌స‌రం. చెడు సహవాసానికి దూరంగా ఉండాల్సిన అస‌వ‌రం ఎంతైన ఉంది.

October 26, 2022 కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు

పట్టుదలతో అనుకున్న ప‌నిని పూర్తిచేసుకో గలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు క‌లుగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు వ‌స్తాయి.

horoscope on diwaliOctober 26, 2022 horoscope సింహ రాశి ఈరోజు ఫలితాలు

కొన్ని విష‌యాల‌లో ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. మోసపోయే అవకాశం ఉంటుంది. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండాలి

-Advertisement-

October 26, 2022 కన్య రాశి ఈరోజు ఫలితాలు

విదేశీయాన ప్రయత్నాలు చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది.

October 26, 2022 horoscope తుల రాశి ఈరోజు ఫలితాలు

అనారోగ్య బాధలతో ఇబ్బంది ప‌డ‌తారు.. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక‌పోవ‌డం వ‌ల‌న మానసిక ఆందోళన చెందుతారు. . ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

October 26, 2022 వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు

ఆత్మీయుల సహకారం ఎక్కువ‌గా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణబాధలు ఎక్కువ అవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం వ‌ల‌న ఇబ్బందులు ప‌డ‌కుండా ఉంటారు.

October 26, 2022 ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు

కోపాన్ని త‌ప్ప‌క‌ అదుపులో ఉంచుకోవాలి . మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం చేయాలి . శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండ‌క‌పోవ‌డం వ‌ల‌న ఇబ్బందులు ప‌డ‌తారు. ధనవ్యయం తప్పదు.

October 26, 2022 మకర రాశి ఈరోజు ఫలితాలు

కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా చూసుకోవాలి. కుటుంబ‌ వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.

October 26, 2022 కుంభ రాశి ఈరోజు ఫలితాలు

ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. ఆరోగ్యం విష‌యంలో జాగ్రత్త‌గా ఉండాలి.

October 26, 2022 మీన రాశి ఈరోజు ఫలితాలు

అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు చేయాలి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు కొద్దిగా ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు.

ఇవి కూడా చదవండి :

ఈ పండక్కి శనగపప్పు హల్వా చేసుకొండిలా..అచ్చం పుల్లారెడ్డి స్వీట్ లా..

Vitamin D deficiency : విటమిన్ డి లోపానికి చక్కని పరిష్కారం!

నిద్ర బాగా పట్టాలంటే..ఇలా చేయండి.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News