HomedevotionalHoroscope (26-03-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (26-03-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 26th March 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి శుభ ఫలితములు కలుగుచున్నవి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబానికి స్నేహితులకు ధనసహాయము, దానధర్మములు చేస్తారు. నూతనంగా వస్తువులు కొనడానికి ధనాన్ని ఖర్చు చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన.

వృషభం

ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలించును. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. ఆర్ధికపరంగా లాభము చేకూరుతుంది. ఉద్యోగులకు లాభదాయకముగా ఉండును. శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని మరియు దుర్గాదేవిని పూజించాలి.

మిథునం

ఈ రాశివారికి కుటుంబ సౌఖ్యము కలుగును. ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. మిథునరాశివారు మరిన్ని శుభఫలితాల కోసం దుర్గాదేవిని పూజించాలి. తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ఆరోగ్యం విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలి.

కర్కాటకం

ఈ రాశి వారు ఆరోగ్య విషయాలయందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు ఏర్పడుతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించ‌డం ఉత్త‌మం. వివాదాల‌కి దూరంగా ఉండాలి.

సింహం

ఈ రాశి వారికి చికాకులు, సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. గొడవలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. పిల్లల విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి. చెప్పుడు మాట‌లు విని మోస‌పోవ‌ద్దు.

-Advertisement-

horoscope today teluguకన్య

ఈ రాశి వారికి సమాజంలో కీర్తి, శత్రువులపై విజయము కలుగును. అనుకున్న ప్రతీ పనియందు విజయం సాధిస్తారు. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగుతాయి.. ఉద్యోగస్తులకు అనుకూల సమయము, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి.

తుల

ఈ రాశి వారికి చేసే పనుల యందు అనుకూలమైన ఫలితాలు పొందెదరు. కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. రాహువు ప్రభావంచేత చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశి వారికి ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించ‌డం మంచిది.

వృశ్చికం

ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. కుటుంబ సౌఖ్యము కలుగును. ప్రయాణములు అనుకూలించును. శారీరక శ్రమ అధికముగా ఉండును. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదములకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

ధనస్సు

ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. చేసే పనులయందు విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. మానసిక ఒత్తిళ్ళు పెరుగును. గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును.

మకరం

ఈ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా తీరికలేని పరిస్థితి వ‌స్తుంది.. దగ్గర బంధువులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు. ఆర్థిక సంబంధమైన విషయాలలో వాగ్దానాలు చేయక‌పోవ‌డం మంచిది.

కుంభం

ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు, వేదనలు, సమస్యలు అధికముగా ఉండును. పనుల యందు ఆలస్యము. కుటుంబ వ్యవహారాలయందు చికాకులు ఏర్ప‌డ‌తాయి. చేసే పనులు అనుకూలించి సత్ఫలితాలు ఇచ్చును. గత కొంతకాలము నుండి వేధిస్తున్న అనేక సమస్యల నుండి బయట పడేటటువంటి ప్రయత్నములో విజయాన్ని పొందుతారు.

మీనం

ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీనరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయము. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

also read :

TSPSC paper leak : పేపర్‌ లీకేజీకి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలి: బండి సంజయ్‌ డిమాండ్‌

Suryakumar Yadav : అవకాశాలిస్తే వరల్డ్‌కప్‌లో సెన్సేషన్‌ అవుతాడు.. సూర్యకు యువీ మద్దతు!

Viral Video : ఇదేందయ్యా ఇదీ.. ఎండిపోయిన చేపపై నీరు పోయగానే బతికేసింది!

Pawan Kalyan : కొద్ది రోజుల పాటు రాజకీయాల‌కి బ్రేక్.. పూర్తిగా సినిమాల‌తోనే బిజీ..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News