Horoscope Today:
మేష రాశి:
ఈ రాశి వారు వారి ప్రియమైన వారిని కలవడం వల్ల సంతోషకరంగా ఉంటారు. ఆదాయం,ఖర్చులు బ్యాలెన్స్ చేసుకోవాలి. షాపింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆస్తికి సంబంధించిన వ్యాపారులు మంచి ఒప్పందాన్ని పొందే అవకాశం ఉంటుంది.
వృషభం:
ఈ రాశి వారు నేడు కుటుంబ, వ్యక్తిగత కార్యక్రమాల్లో చాలా సమయం గడుపుతారు. ఈ రోజు మీ రహస్యాలు కొన్ని బయటపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మంచి సహకారం అయితే లభిస్తుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు.
మిథునం
ఈ రాశి వారు పెద్ద పనిని పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. మరోవైపు మీ రోజువారీ పనిలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఏదైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకరి సలహా తీసుకోవడం మంచిది. కొన్ని విచారకరమైన వార్తల వల్ల మీరు బాధపడతారు.
కర్కాటకం
ఈ రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో మంచి లాభాలు అందుకుంటారు. పనుల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండటం వల్ల మీ సామర్ధ్యం పెరిగే అవకాశం ఉంది.విజయం కోసం మీ భావాలని కోల్పోవద్దు. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది.
సింహ రాశి:
ఈ రాశి వారు నేడు అన్ని విషయాలలో గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీరు సామాజిక కార్యక్రమాలలో చురకుగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబానికి సరైన సమయం ఇవ్వలేకపోవచ్చు. 75 శాతం అదృష్టం ఉంటుంది.
కన్యా రాశి
ఈ రాశి వారికి నేడు ఆస్తికి సంబంధించిన వివాదాలలో ఇరుక్కుంటారు. మీ కోపాన్ని, ఉద్రేకాన్ని కొంత నియంత్రించుకోవాలి. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
తులా రాశి
ఈ రాశి వారిలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వారికి మంచి ఫలితం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభించే అవకాశం ఉంది.
వృశ్చికం
ఈ రాశి వారికి నేడు బంధువులతో కొనసాగుతున్న వివాదాలు పరిష్కరించబడతాయి. మీ సంబంధాలు స్నేహపూర్వకంగా మారే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏదైనా భూమిని కొనుగోలు చేయాలనుకుంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ధనుస్సు
ఈ రాశి వారు ఖాళీ సమయాన్ని కొన్ని ఇష్టమైన రచనలు, సాహిత్యం చదవడంలో గడిపే అవకాశం ఉంటుంది. భూమి విషయంలో కొంత నష్టం లేదా తగాదా వచ్చే అవకాశం ఉండడం వలన జాగ్రత్తగా ఉండడం మంచిది. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారం మెరుగుపడుతుంది.
మకరం
ఈ రాశి వారు మీరు సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. ఆర్థిక పెట్టుబడుల విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోవడం మంచిది. మరోవైపు మీ మనసులో కొన్ని విషయాల పట్ల ప్రతికూల ఆలోచనలు తలెత్తే అవకాశం ఉంది.
కుంభం
ఈ రాశి వారు తమ బంధువుల సమస్యను పరిష్కరించడంలో భాగస్వాములు అవుతారు. సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకండి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
మీనం
ఈ రాశి వారికి ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకునేందుకు ఇంటి సభ్యులంతా కలిసి ప్రణాళికలు రచిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులన్నీ యధావిధిగా జరుగుతాయి