HomedevotionalHoroscope (24-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (24-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 24th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Aries horoscope

ఈ రాశి వారు చేసే కొన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. తొందరపడి నిర్ణయాలు ఏ మాత్రం మార్చుకోవద్దు. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే ఛాన్స్ ఉంది. అధికారులు మీ మీద అతిగా ఆధారపడటం జరగే ఛాన్స్ ఉంది. కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకోవ‌డంతో సంతోషంగా ఉంటారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Taurus horoscope

ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు అయితే వ‌స్తాయి. మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోగ‌లుగుతారు.. వ్యాపార రంగంలోని వారు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువ‌గా ఉంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Gemini

ఈ రాశి వారికి ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందిస్తుంది. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ఛాన్స్ ఉంది. కొందరు సన్నిహితులకు అండగా నిలబడే ఛాన్స్ ఉంది. ఇతరుల ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు ఏ మాత్రం పనికిరావు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Cancer horoscope

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. కొద్దిగా ప్రయత్నిస్తే వ్యక్తిగత సమస్యలుకూడా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనే ఛాన్స్ ఉంది.. వివాదాలకు దూరంగా ఉండటం ఎంతైన అవ‌సరం. వ్యాపారంలో లాభాలు పెరగడానికి కొంత క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Leo

ఈ రాశి వారు వ్యక్తిగత పనులను వాయిదా వేయటం మంచిది కాదు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. కొన్ని కుటుంబ విషయాలు చికాకు పెట్టే ఛాన్స్ ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో మంచి పేరు కూడా తెచ్చుకుం టారు.

-Advertisement-

horoscope today in teluguకన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Virgo

ఈ రాశి వారు అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగే ఛాన్స్ ఉంది.. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌సరం ఉంది.. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయటం అస‌వ‌రం.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Libra horoscope

ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ఆశించిన సహాయ సహకారాలు లభించే అవ‌కాశం ఉంది.. ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఎంతైన అవ‌స‌రం. మీ మనసులోని కోరిక ఒకటి త‌ప్ప‌క నెరవేరుతుంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Scorpio

ఈ రాశి వారికి వాగ్దానాలు చేయటానికి, హామీలు ఉండటానికి ఇది స‌రైన‌ సమయం కాదు. జేష్ట నక్షత్రం వారికి ఎంత‌గానో కలిసి వస్తుంది. వారి మాటకు విలువ పెరిగే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు మార్పు చెందే అవకాశం ఎక్కువ‌. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఎక్కువే.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Saggitarius

ఈ రాశి వారు కొద్ది ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముందడుగు వేసే అవ‌కాశం ఉంది.. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవ‌కాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ ల‌భిస్తుంది.. పూర్వాషాడ వారు ఆర్థికంగా పురోగతి సాధించే అవ‌కాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Capricorn horoscope

ఈ రాశి వారు పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడతారు. ధనిష్టా నక్షత్రం వారికి అవకాశాలు కలిసి వస్తాయి. కొందరు స్నేహితులకు దూరంగా ఉండటం ఎంతైన అవ‌స‌రం. బంధువుల కారణంగా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. ఉచిత సేవలకు, అనవసర ఖర్చులకు అవకాశం ఎక్కువ‌. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Aquarius

ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొంతమంది మిత్రులు మీ పురోభివృద్ధికి సహాయపడే ఛాన్స్ ఎక్కువ‌. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతైన‌ అవసరం. ఉద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది.. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 24, 2023 Pisces horoscope

ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితిలో పురోగతి కనిపిస్తుంది. ఐటీ వంటి వృత్తి నిపుణులు ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందే అవ‌కాశ కూడా ఉంది. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి డిమాండ్ పెరిడే ఛాన్స్ కూడా ఉంది.. ఆరోగ్యం కొద్దిగా పరవాలేదనిపిస్తుంంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురైనా లక్ష్యాలు పూర్తి చేయగ‌లుగుతారు.

also read :

dogs attack in hyderabad : కుక్కల దాడి ఘటనపై హైకోర్టు ఆగ్రహం.. జీహెచ్‌ఎంసీకి కీలక ఆదేశాలు

Vishal: విశాల్ షూటింగ్స్‌లోనే ఇలా వ‌రుస ప్ర‌మాదాలు.. లక్కీగా ప్రాణాలతో బ‌య‌ట‌పడ్డ హీరో

Chandrababu Naidu : బాబాయి హత్య కేసులో జగన్‌ దొరికిపోయారు.. కన్నా చేరిక సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News