Telugu Flash News

horoscope today telugu : 24-01-2023 మంగళవారం రాశి ఫ‌లాలు

horoscope today in telugu

horoscope today, 24th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Aries horoscope

ఈ రాశి వారికి ఈ రోజు సౌఖ్యము కలుగును. దశమ స్థానమునందు శని ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కుజుని ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండటం ఎంతైన అవ‌స‌రం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్య‌వ‌హరించ‌డం మంచిది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Taurus horoscope

వృషభరాశి వారు ఆరోగ్య విషయాల యందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు అధికమగు సూచనలు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. బృహస్పతి యొక్క అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీయొక్క శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం సాధిస్తారు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Gemini

ఈ రాశి వారు ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. సౌఖ్యమును పొందెదరు. ఈ రోజు ధన లాభము కలుగును. అష్టమశని ప్రభావంచేత ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Cancer horoscope

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు వ‌స్తాయి.. మీకు అన్ని విధాలుగా ఈ రోజు కలిసి వచ్చును. ఆరోగ్య విషయాల యందు, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం ఎంతైన అవ‌స‌రం. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు ఎంత‌గానో అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొల‌గిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Leo

ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. ఉద్యోగస్తులకు ఉ ద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటిరోజు.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Virgo

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ఈ రాశి వారు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ వారం ఒత్తిళ్ళు తగ్గును. శని, స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందెదరు. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Libra horoscope

తులారాశి వారికి ఈ రోజు చెడు ఫ‌లితాలు వ‌స్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధించును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Scorpio

వృశ్చికరాశికి ఈ రోజు అంత అనుకూలముగా లేదు. ఆరోగ్యమునందు సమస్యలు ఏర్పడును. కుటుంబం నందు స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది.వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఎక్కువ‌గా ఉంటాయి.. వృశ్చిక రాశివారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Saggitarius

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. ఏలినాటి శని ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Capricorn horoscope

ఈ రాశి వారికి పనులయందు ఇబ్బందులు ఆటంకములు ఏర్పడును. కష్టపడాల్సినటువంటి సమయం. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దత్తాత్రేయుని పూజించాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Aquarius

ఈ రాశి వారికి ఆర్ధికపరంగా అనుకూలించును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితములు కలిగించును. ఆరోగ్యము అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారములో ఉన్న సమస్యలు తొలగును.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 23, Pisces horoscope

మీన రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. పనులు యందు చికాకులు ఏర్పడును. కుటుంబమునందు సమస్యలు వేధించును. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలి. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేస్తారు.. కీర్తి, సౌఖ్యము కలుగును. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించాలి.

also read news: 

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

Foods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..

Dry Fruits Health Benefits : పోషకాలకు నిలయం డ్రై ఫ్రూట్స్

Curry Leaves Health Benefits: ఆరోగ్య ప్రదాయిని.. కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలివే..!

healthy food for kids : పిల్లలు ఫుడ్‌ తినడానికి మారాం చేస్తున్నారా? ఈ టిప్స్‌ పాటిస్తే ఇష్టంగా తింటారు!

 

Exit mobile version