Homedevotionalhoroscope today telugu : 23-12-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

horoscope today telugu : 23-12-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 23rd december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Aries horoscope

ఈ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు కూడా స్వల్పంగా ఉన్నాయి. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆరోగ్యం విష‌యంలో కూడా కొంత జాగ్ర‌త్త‌లు వ‌హించాలి.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Taurus

ఈ రాశి వారు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్తలు పాటించాలి.. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Gemini

ఈ రాశి వారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు జ‌రుగుతుంది.. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త ప‌డాల్సి ఉంటుంది.. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ త‌ప్ప‌నిస‌రి.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Cancer horoscope

ఈ రాశి వారికి కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులోనే ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేయాల్సి వ‌స్తుంది.. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Leo

ఈ రాశి వారు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు కొంత ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల త‌ప్ప‌క‌ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.

-Advertisement-

horoscopeకన్య రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Virgo

ఈ రాశి వారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు క్ర‌మ‌క్ర‌మంగా తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఎంతో కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Libra horoscope

ఈ రాశి వారి మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు వ‌హించాలి . అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఎక్కువ‌గా ఉండే ఛాన్స్ ఉంది.. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Scorpio

ఈ రాశి వారు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాల‌ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు క్ర‌మంగా తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Saggitarius

ఈ రాశి వారి కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు ఎక్కువ‌గా వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. మనస్తాపానికి కొంత‌ గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోవ‌ల్సి వ‌స్తుంది.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Capricorn horoscope

ఈ రాశి వారు బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళనఎక్కువ అవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి ఏర్ప‌డుతుంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప‌క్కా ప్రణాళికలు వేస్తారు.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Aquarius

ఈ రాశి వారు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ‌. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పుల‌ను కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 23, 2022 Pisces horoscope

ఈ రాశి వారు ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో త‌ప్ప‌క విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు క్ర‌మంగా పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి ఉన్న‌వారు వివిధ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు.

also read news:

Shahid Afridi: షాహిద్ ఆఫ్రిది కూతురి పెళ్లిపై వ‌చ్చిన క్లారిటీ.. వ‌రుడు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Moral Stories in Telugu : జమిందారు – సాధువు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News