Homehoroscopehoroscope today July 23, 2023 - ఈ రోజు రాశి ఫలాలు 23-07-2023

horoscope today July 23, 2023 – ఈ రోజు రాశి ఫలాలు 23-07-2023

Telugu Flash News

horoscope today July 23, 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Aries horoscope

ఈ రాశి వారికి అనారోగ్య సమ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. అలానే ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. తొంద‌ర‌గా రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి.

శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది.

అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Taurus horoscope

ఈరోజు దూర బంధువులతో కల‌వ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధించ‌డం సంతోషాన్ని ఇస్తుంది.

వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి.

-Advertisement-

చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Gemini

ఈరోజు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. ఆకస్మిక ధననష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.

అధికారులతో జాగ్రత్తగా మెలగడం త‌ప్ప‌నిస‌రి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.

ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Cancer horoscope

ఈరోజు కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైన అభివృద్ధిని సాధించడం జరుగుతుంది.

గతంలో వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు.

స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Leo

ఈరోజు చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్త వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆవేశంవల్ల కొన్నిపనులు చెడిపోతాయి.

తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుండ‌డం వ‌ల‌న చిరాకు ప‌డ‌తారు. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.

వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Virgo

ఈరోజు బంధు, మిత్రులతో విరోధం ఏర్ప‌డుతుంది. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. ప్రయ‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి.

ఉద్యోగులు ఈ రోజు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది.

కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టంపట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Libra horoscope

ఈరోజు వీరికి అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.

ఒకటి కోరుకుంటే, మరొకటి జరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.

horoscope today in telugu

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Scorpio

ఈ రాశి వారు నేడు దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ప‌రిష్కారం అవుతాయి. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.

అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Saggitarius

ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌డ‌మే కాకుండా, ఆత్మీయుల సహాయ సహకారాలకోసం కొంత స‌మ‌యం వెచ్చించాలి. ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు.

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Capricorn horoscope

ఈరోజు కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు త‌లెత్తుతాయి. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేస్తారు.

వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి త‌ప్ప‌క క‌నిపిస్తుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు.

స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Aquarius

ఈరోజు ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. అనుకున్న కార్యక్రమాలకు ఆటంకాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరాస్తి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు.

చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 23, 2023 Pisces horoscope

ఈరోజు బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు, వస్త్రాలు, వాహనాలు, ఆభరణాల లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు.

బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన‌డం వ‌ల‌న సంతోషం చెందుతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

also read :

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News