Homedevotionalhoroscope today : 22-11-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 22-11-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

horoscope Today, 22nd november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Aries horoscope

ఈ రాశి వారు కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం చాలా అవసరం. శారీరక అనారోగ్యంతో కొంత బాధపడుతారు. కుటుంబ విషయాలు అనుకున్నంత సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Taurus

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను పొందుతారు. నూతన కార్యాలను ప్రారంభించే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Gemini

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం ఏర్ప‌డేఅవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Cancer horoscope

కుటుంబ విషయాలపై కాస్త‌ అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకునే అవ‌కాశం ఉంది. .స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం అవ‌స‌రం.

horoscopeసింహ రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Leo

బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. మానసిక ఆందోళనతో ఇబ్బంది క‌లుగుతుంది. ఆకస్మిక ధననష్టం క‌లుగుతుంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో చాలా జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Virgo

మానసిక ఆందోళన క‌లుగుతుంది.. ఆరోగ్యం గురించి కొంత‌ జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరం అవుతుంది. ప్రయాణాల్లో మెలకువ కొంత అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు త‌లెత్తుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా లాభిస్తాయి.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Libra horoscope

వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం, స్నేహితుల‌ని క‌ల‌వ‌డం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ త‌ప్ప‌నిస‌రి.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Scorpio

ఈ రాశికి చెందిన కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను కూడా గ్రహిస్తారు.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Saggitarius

ఈ రాశి వారికి కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఏర్ప‌డ‌తాయి.. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు త‌లెత్తే అవకాశం ఉంది. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయోద్దు.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Capricorn horoscope

వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమించే అవ‌కాశం ఉంది.. మానసికాందోళతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు కొంత ఏర్ప‌డుతాయి. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తలు వ‌హించాలి. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Aquarius

ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త వ‌హించాలి. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడ‌దు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన ఉంటుంది.. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం చేయాలి.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 22, 2022 Pisces horoscope

వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి స్లోగా ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి.

also read news:

Viral video : ఒకేసారి తొమ్మిదిమంది పిల్లలతో సైకిల్ మీద…

ఈ పచ్చడి కళ్లకు ఎంతో మేలు.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేసుకోండి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News