Telugu Flash News

22nd october 2022 horoscope శనివారం ఈ రోజు మీ రాశి ఫలాలు

horoscope

horoscope today , 22 October 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి (Aries) ఫలితాలు : October 22, 2022 horoscope

ఈ రాశి వారు మానసిక శాంతి లభించే విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి.

వృషభ రాశి (Taurus) ఫలితాలు : October 22, 2022

ఈ రాశివారు విబేధాలు క‌ల‌గ‌కుండా చూసుకోవాలి. మీ పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. శారీరకంగా అధికంగా శ్రమ పడితే మంచి విజ‌యాలు సాధిస్తారు. శ్రద్ధగా పనిచేసి శుభ ఫలితాలను సొంతం చేసుకుంటారు.

మిధున రాశి (Gemini) ఫలితాలు : October 22, 2022

ఈ రాశివారు నూతన వస్తువు, బట్టలను కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులను త్వ‌రగా పూర్తి చేస్తారు. శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవసరాలకు ధనం చేకూరడ‌డంతో ఆనందంగా ఉంటారు.

కర్కాటక రాశి (Cancer) ఫలితాలు : October 22, 2022 horoscope

ఈ రాశి వారు ఇత‌రుల‌ సహకారంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కీలక వ్యవహారంలో దైర్యంగా ముందుకు అడుగు వేస్తే మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించే ఫలితాలను అందుకుంటారు.

సింహ రాశి (Leo) ఫలితాలు : October 22, 2022

ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనిని సులభంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు.

కన్య రాశి (Virgo) ఫలితాలు : October 22, 2022

ఈ రాశివారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మంచి పనులు చేపడతారు. అనవసర ఆందోళనకు దూరంగా ఉండడం మేలు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది.

తుల రాశి (Libra) ఫలితాలు : October 22, 2022 horoscope

ఈ రోజు ఈ రాశివారు అవసరానికి డబ్బులు అందుకుంటారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. సాయం అందుకుంటారు. చేప‌ట్టిన ప్ర‌తి విష‌యంలో అంతటా విజయం ఉంది.

వృశ్చిక రాశి (Scorpio) ఫలితాలు : October 22, 2022

ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇస్తారు. చేపట్టిన పనుల్లో కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్ల‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. మానసికంగా శాంతి కలుగుతుంది.

ధనస్సు రాశి (Saggitarius) ఫలితాలు : October 22, 2022

ఈ రాశి వారు వృత్తి, విద్య, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధిని అందుకుంటారు. శుభవార్త వింటారు. ఏ ప‌ని ప్రారంభించిన ఆ పనులను సులభంగా పూర్తి చేస్తారు. అధిక ఒత్తిడిని దరిచేరనీయకండి.ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి.

మకర రాశి (Capricorn) ఫలితాలు : October 22, 2022 horoscope

ఈ రాశివారు బంధు, మిత్రుల సహకారంతో అనుకూల ఫలితాలను అందుకుంటారు. చేపట్టే పనుల్లో బద్ధకాన్ని వీడడం మంచిది చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసి స‌క్సెస్ సాధిస్తారు.

కుంభ రాశి (Aquarius) ఫలితాలు : October 22, 2022

ఈరాశివారు శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అభివృద్ధికి సంబంధించి ఇతరుల సహకారంతో ముందుకు వెళుతూ తమ ప‌నిని సుల‌భంగా చేసుకుంటారు. అవసరానికి ఆర్థిక సహకారం అందుకుంటారు. సమయ పాలనతో అన్ని పనులను పూర్తిచేస్తారు.

మీన రాశి (Pisces) ఫలితాలు : October 22, 2022 horoscope

ఈ రాశివారు ప్రతిభతో పనితీరుకు తగిన ప్రశంసలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకోవ‌డం జ‌రుగుతుంది.. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలు రావ‌డం సంతోషంగా ఉంటుంది.. ముఖ్యమైన పనుల విషయంలో ఆర్ధిక పురోగతి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలంటే ఈ చిట్కాలు పాటించండి.

పిల్లల్లో జ్వరానికి భయపడద్దు.. ఇలా చేయండి..

Exit mobile version