HomedevotionalHoroscope Today: 22-09-2022 రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు నేడు మంచి లాభాలను పొందుతారు!

Horoscope Today: 22-09-2022 రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు నేడు మంచి లాభాలను పొందుతారు!

Telugu Flash News

Horoscope Today:

మేష రాశి: ఈ రాశి వారు నేడు కొత్త వాహనం, ఇల్లు మొదలైనవాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కొద్దిగా ఆగ‌డం మంచిది. త్వ‌ర‌లోనే ప‌రిస్థితులు అనుకూలంగా మారుతాయి. వ్యాపార‌స్థుల‌కి మంచి లాభాలు ద‌క్కుతాయి.

వృష‌భం: ఈ రాశి వారికి నేడు ఆరోగ్యం బాగోలేక‌పోతే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాలి. జీతాలు తీసుకునే వ్యక్తులు తమపై ఎక్కువ పని ఒత్తిడి పెట్టుకోకుండా ఉండాలి. ప్రశాంతమైన మనస్సుతో పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారులకు ఈరోజు చాలా శుభసూచకంగా ఉంటుంది . జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.

మిథునం : ఈ రోజు మీకు చాలా ముఖ్యమైనది అని చెప్పాలి. పాస్‌పోర్ట్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. తల్లిదండ్రులతో అనుబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండ‌డం మంచిది

కర్కాటక రాశి: ఈ రాశి వారికి కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది, పై అధికారుల మద్దతు లేకపోవడం వల్ల ప‌లు సమ‌స్య‌లు ఎదుర్కొంటారు. ఆర్ధిక‌రంగా న‌ష్ట‌పోతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందుతారు.

సింహ రాశి: ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.. మీ ప్రియమైన వారు చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, బలహీనంగా ఉండే అవ‌కాశం ఉంది

-Advertisement-

కన్యా రాశి: శృంగార జీవితంలో ప‌లు స‌మ‌స్యలు వ‌స్తాయి.. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీ జీవిత భాగస్వామికి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయించండి. వ్యాపారులు ఈరోజు తగిన ఫలితాలను పొందుతారు. మీకు కీళ్లనొప్పుల సమస్య ఉంటే, ఈరోజు మీ సమస్య పెరిగే అవ‌కాశం ఉంది.

తుల రాశి: ఈ రోజు మీకు డబ్బు పరంగా చాలా ఖరీదైనదిగా ఉంటుంది. అప్పుల భారం కూడా మీకు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈరోజు చాలా కష్టపడతారు. మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించ‌డం మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు త‌మ కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటారు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితంలో పరిస్థితి మాములుగానేగా ఉంటుంది. మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపుతారు. మీకు చేతులు లేదా కాళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలు రావ‌చ్చు

ధనుస్సు రాశి: వైవాహిక జీవితంలో కొంత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది .ఈరోజు మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. మీరు భాగస్వామ్యంతో కొన్ని కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలను అందుకునే అవ‌కాశం ఉంది. మీకు కాలేయ సంబంధిత సమస్య ఏదైనా ఉంటే, ఆహారం విష‌యంలో త‌ప్ప‌క శ్రద్ధ వ‌హించాలి.

మకర రాశి: మీరు ఉద్యోగం చేసి, ఉద్యోగం మార్చడానికి ఇటీవల ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే, గుడ్ న్యూస్ పొంద‌వ‌చ్చు. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి త‌ప్ప‌క వ‌స్తుంది. ప్రియమైన వారితో చాలా సరదాగా గడుపుతారు. ఆకస్మికంగా డబ్బు అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు మీరు కొత్త ఆస్తి, వాహనం మొదలైనవాటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు పొంద‌గ‌లుగుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మంచిగా ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మీన రాశి: వైవాహికం లేదా శృంగార జీవితంలో మంచి ఫ‌లితాలు పొందుతారు. డబ్బు గురించి చూస్తే , ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు వ‌స్తాయి. పని గురించి మాట్లాడితే, కార్యాలయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడ‌దు. ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశ ఉంది.. ఈరోజు మీకు కంటికి సంబంధించిన సమస్యలు రావ‌చ్చు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News