Horoscope Today, 22nd april 2023: Check astrological prediction for your zodiac signs
మేష రాశి :
ఈ రాశి వారికి ఒత్తిళ్ళు అధికముగా ఉండును. పనుల యందు చికాకులు, మాట పట్టింపులు ఏర్పడుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం . ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశికి చెందిన వ్యాపరాస్తులకి శుభ ఫలితాలు లభిస్తాయి.
వృషభ రాశి :
ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వృషభరాశి వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలించును స్త్రీలకు మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.
మిథున రాశి :
ఈ రాశి వారికి కుటుంబమునందు వివాదములు, అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది . వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మానసిక ఆందోళనలు వేదనలు అధికముగా ఉంటాయి. సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. మిథున రాశివారు ఈ రోజు కోసం లక్ష్మీ సహస్రనామాన్ని పఠించండి.
కర్కాటక రాశి :
ఈ రాశి వారికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది.. కర్కాటక రాశివారికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నిస్తారు. . స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది.
సింహ రాశి :
ఈ రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం ఉద్యోగ వ్యాపారాలయందు అనుకూల ఫలితములు అధికముగా ఉంటాయి. స్త్రీలకు ఈ రోజు అనుకూలముగా ఉంటుంది.
కన్య రాశి :
ఈ రాశి వారు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలిస్తాయి.. ఆరోగ్య విషయాల్లో మరియు కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం ఉత్తమం.
తులా రాశి :
ఈ రాశి వారు చేసే పనుల యందు అనుకూలమైన ఫలితాలు పొందెదరు. కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సౌఖ్యము ఉంటుంది.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వృశ్చికరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది.
ధనుస్సు రాశి :
ఈ రాశి వారికి నేడు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ఈ రోజు ఈ రాశి వారికి ధనలాభము సౌఖ్యము కలుగుతుంది.. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
మకర రాశి :
ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు అధికముగా మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.,. వ్యాపారస్తులకు చెడు సమయము అని చెప్పాలి.. మకర రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం మంచిది.
కుంభ రాశి :
ఈ రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలున్నాయి అధికముగా ఉన్నాయి. ఆర్ధిక పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక సమస్యలు ఏర్పడుతాయి.. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉంటాయి. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. ఈ రాశి వారికి ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు.
మీన రాశి :
ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనపరమైనటువంటి వ్యవహారాలయందు జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. రాజకీయ ఒత్తిళ్ళు అధికమగును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
also read :
Naveen Yerneni : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతకి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..!
Ambati Rayudu : అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందా? అందుకే ఆ ట్వీట్ చేశాడా?
Dominic Raab : బ్రిటన్‌లో సంచలనం.. డిప్యూటీ ప్రధాని రాజీనామా
Chhattisgarh : ఇరవై ఏళ్ల కిందట చంపేస్తే.. కలలోకి వచ్చి టార్చర్ పెడుతున్నాడు..!
Akhil-RamCharan: రామ్ చరణ్, అఖిల్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ రానుందా.. అసలు విషయం ఏంటంటే..!
Samantha: సమంత అనారోగ్యం అంతా నాటకమా.. సినిమా కోసం అలా చేసిందా?
దసరా మూవీలోని బరాత్ బీట్‌కి ఇంద్రజ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్