Telugu Flash News

Horoscope (22-03-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

horoscope 2023

Horoscope Today, 22nd March 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

మేష రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశి వారు ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగములో ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. స్త్రీలకు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వ‌హించ‌డం మంచిది.

వృషభం

వృషభ రాశి వారు ఆరోగ్యం విష‌యంలో, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగ, వ్యాపారములయందు కలసి వచ్చును. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. బృహస్పతి అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ‌తారు

మిథునం

మిథున రాశి వారికి రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు ఏర్పడును. ఈ రాశి వారికి చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం ఉత్త‌మం. సమస్యలను, ఒత్తిళ్ళను ఎంతో నేర్పుతో అధిగమించెదరు.

కర్కాటకం

కర్కాటక రాశి వారు ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితం ల‌భిస్తుంది. మీకు అన్ని విధాలుగా ఈ రోజు కలిసి వచ్చును. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించడం ఉత్త‌మం.

సింహం

సింహరాశి వారికి ఈ వారం రోజు మీకు మధ్యస్థముగా ఉంటుంది.. సింహరాశి వారు మీ సమస్యలను నేర్పుతో అధిగమించెదరు. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగుతుంది.

కన్య

కన్యారాశి వారికి ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు ఎంతో అనుకూలించును. చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు, దైవదర్శనములు ఎంతో అనుకూలించును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది.

తుల

తులారాశి వారికి పనియందు చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించ‌డం ఉత్త‌మం. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు, కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధిస్తుంది.. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమవుతాయి. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారు చేసే ప్రతీ పనియందు విజయాన్ని పొందెదరు. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని స‌కాలంలో పూర్తి చేసెదరు. శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం ఉత్త‌మం.

ధనస్సు

ధనూ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది.

మకరం

మకర రాశి వారికి ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. ఇది ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయం. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. మకర రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించాలి.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఏలినాటి శని వలన చేసే ప్రతీ పనియందు కొంత ఆటంకములు ఏర్పడుతాయి. చేసే ప్ర‌తి ప‌నిలో కొంత ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

మీనం

మీన రాశి వారికి ఆర్ధిక లాభములు వ్యాపార లాభము కలుగును. ఉద్యోగస్తులకు కలసివచ్చే సమయం.ఈ రాశి వారు మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు.

Also Read :

ugadi recipes 2023 : ఉగాది రోజున సింపుల్‌గా చేసుకొనే నైవేద్యాలివే..

TSPSC : నాలుగో రోజు విచారణలో మరిన్ని ఆధారాలు.. రాజశేఖర్‌ ఇంట్లో ప్రశ్నపత్రాలు స్వాధీనం!

ఇండియాలో ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్

Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావుపై అసత్య ప్రచారాల వెనుక ఆ రాజకీయ నేత అభిమానులు?!

RRR: ఆస్కార్ అవార్డ్ ఫంక్ష‌న్‌కి చిత్ర నిర్మాత వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

Salman Khan: రోజు రోజుకి స‌ల్మాన్‌కి పెరుగుతూ పోతున్న బెదిరింపులు… మరింత భద్రత పెంపు

Taraka ratna: తార‌క‌ర‌త్న పేరుతో బాల‌య్య సేవా కార్య‌క్ర‌మం..బాబాయ్ ప్రేమంటే ఇదే క‌దా..!

Rashmika: నా బేబీని చాలా మిస్ అవుతున్నానంటూ ర‌ష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

Exit mobile version