HomedevotionalHoroscope (22-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (22-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 22nd february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Aries horoscope

ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగరంగాల్లో పురోగ‌తి సాధిస్తారు.. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువ‌. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ప‌డ‌తారు.. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం ఎంతైన అవ‌స‌రం

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Taurus horoscope

ఈ రాశి వారు రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఎక్కువ‌. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతాయి.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Gemini

ఈ రాశి వారి కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ . వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంది.. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్త వ‌హించాలి.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Cancer horoscope

ఈ రాశి వారు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టే ఛాన్స్ ఉంది.. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయ‌గ‌లుగుతారు.. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Leo

ఈ రాశి వారికి కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి కూడా ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధించే ఛాన్స్ ఉంది. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు కొంత‌ సంతృప్తినిస్థాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి.

-Advertisement-

horoscope today in teluguకన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Virgo

ఈ రాశి వారికి మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరం అవుతుంది. ప్రయాణాల్లో మెలకువ పాటించాలి.. విదేశయాన ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Libra horoscope

ఈ రాశి వారు కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ‌. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరే ఛాన్స్ ఉంది.. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంది.. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవ‌స‌రం.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Scorpio

ఈ రాశి వారి కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసే ఛాన్స్ ఉంది.. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. . వ్యవసాయ మూలకంగా లాభాలను పొంద‌గ‌లుగుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను క్ర‌మంగా గ్రహిస్తారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Saggitarius

ఈ రాశి వారు విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకుండా ఉండాలి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే ఛాన్స్ ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురు కావ‌డం, ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించ‌డం అవసరం.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉండే ఛాన్స్ ఉంది.. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతం చెందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఎక్కువ‌.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Aquarius

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించే అవ‌కాశం ఉంది.. అన్నింటా విజయాలని సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తూ ఉండ‌డం జ‌రుగుతుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఎంతో ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 22, 2023 Pisces horoscope

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి.. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం ఎంతైన‌ అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎక్కువ‌గా ఉంటాయి.

also read:

Jobs : నెలకు 4 లక్షల జీతం.. ఎవరూ ముందుకు రావడం లేదు.. కారణం ఏంటి?

Supreme Court : వివాహ వయసు పెంచే అధికారం మాకు లేదు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు!

Prabhas : చిరంజీవి అడ్డాలో ప్ర‌భాస్ సినిమా షూటింగ్‌..

Shehnaaz Gill Hot in dabboo ratnani Photoshoot 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News