Homedevotional21st october 2022 horoscope శుక్రవారం ఈ రోజు మీ రాశి ఫలాలు

21st october 2022 horoscope శుక్రవారం ఈ రోజు మీ రాశి ఫలాలు

Telugu Flash News

know your horoscope and astrological predication for 21st october 2022 of your zodiac signs..

మేష రాశి (Aries) ఫలితాలు : October 21 , 2022 horoscope

ఈరోజు ఈ రాశి వారు సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండ‌డం మంచిది . అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అప్పుల విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి

వృషభ రాశి (Taurus) ఫలితాలు : October 21, 2022

ఈ రాశి వారు బంధుమిత్రులతో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతారు. కుటుంబంలో సుఖ, సంతోషాలు వెల్లి విరుస్తాయి. దూర ప్రయాణాలు చేయ‌డం, చేపట్టిన పనులను పూర్తిచేయ‌డం వంటివి చేస్తారు.

మిధున రాశి (Gemini) ఫలితాలు : October 21, 2022 horoscope

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే అవ‌కాశం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి (Cancer) ఫలితాలు : October 21, 2022

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెంద‌డం వ‌ల‌న అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. . విందులు, వినోదాల్లో ఎక్కువ‌గా పాల్గోంటారు.

సింహ రాశి (Leo) ఫలితాలు : October 21, 2022

ఈ రాశి వారు నూతన గృహనిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు అన్ని స‌మ‌సిపోతాయి. శతృబాధలు దూరం కావ‌డం వ‌ల‌న హాయిగా ఉంటారు.

-Advertisement-

horoscopeకన్య రాశి (Virgo) ఫలితాలు : October 21, 2022

ఈరోజు వీరు విందులు, వినోదాలకు దూరంగా ఉంటారు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.

తుల రాశి (Libra) ఫలితాలు : October 21, 2022 horoscope

ఈ రాశి వారు చేప‌ట్టిన కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. . దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవ‌డం వ‌ల‌న ఆనందంగా ఉంటారు.

వృశ్చిక రాశి (Scorpio) ఫలితాలు : October 21, 2022

ఈ రాశి వారికి రాజకీయ రంగాల్లో ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడంతో పాటు చెప్పటిన పనులు వాయిదా వేసుకుంటారు.

ధనస్సు రాశి (Saggitarius) ఫలితాలు : October 21, 2022

ఈ రాశి వారు విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు.

మకర రాశి (Capricorn) ఫలితాలు : October 21, 2022

ఈరోజు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం వ‌ల‌న స‌మ‌స్య‌లు ద‌రి చేర‌వు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి (Aquarius) ఫలితాలు : October 21, 2022 horoscope

ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆత్మీయుల సహకారం త‌ప్ప‌క‌ లభిస్తుంది.

మీన రాశి (Pisces) ఫలితాలు : October 21, 2022 horoscope

ఈరోజు . సంఘంలో మర్యాదలు క‌లుగుతాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు

ఇవి కూడా చూడండి :
తీయని పాట మీ గొంతులో పలకాలంటే… ఇలా చేయండి.

రాత్రిపూట తలస్నానం చేస్తే..నష్టమా ? లాభమా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News