Horoscope Today:
మేషం : ఈ రాశి వారికి గ్రహాల ప్రభావం వల్ల మంచి విజయాలు దక్కొచ్చు. వ్యాపారులకు ఈరోజు అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది.. విద్యార్థులు, యువతకు ఏదైనా సమస్యలు ఎదురైతే అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం మంచిది
వృషభం : ఈరోజు కుటుంబ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించితే మంచిది. మహిళలు ఈరోజు ఇంటి పని, వ్యక్తిగత పనులను సులభంగా పూర్తి చేసే అవకాశ ఉంది. మీరు మీ కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. 85 శాతం వరకు అదృష్టం మీకు లభిస్తుంది.
మిధునం : ఈ రాశి అనుభవం ఉన్న సీనియర్ల సలహాలు పాటిస్తే దీర్ఘకాలిక ఆందోళనలు కూడా దూరమవుతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. పిల్లల సమస్య కారణంగా మీ ఇంట్లో వివాదం లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటకం : మీరు ప్రత్యేక స్నేహితుడి నుండి మద్దతును పొందుతారు. ఈ కారణంగా మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. అలానే ఆర్థిక పరమైన విషయాల్లో మీకు కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
సింహ రాశి : ఈరోజు మీరు ముఖ్యమైన వ్యక్తిని కలవడం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది. రాజకీయ కార్యకలాపాలకు కొంత సమయం కేటాయిస్తే మంచిది. ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
కన్యా రాశి : ఈ రాశి వారికి నేడు ప్రియమైన బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. విద్యార్థులు, యువత వారి కెరీర్, అధ్యయన సంబంధిత కార్యకలాపాలలో మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఈరోజు సమయం అనుకూలంగా లేదనే చెప్పాలి.
తులా రాశి : ఈ రాశి వారు వృత్తి విద్య విషయంలో మంచి విజయం సాధిస్తారు. ఒక్కోసారి కుటుంబ సభ్యుల కార్యకలాపాలు మీ మనసును బాధిస్తాయి. ఈరోజు మీ ఖర్చులు మరింత ఆందోళన కలిగిస్తాయి. వ్యక్తిగత సమస్యల కారణంగా వ్యాపార కార్యకలాపాల్లో కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.
వృశ్చికం : పాత వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు భూమికి సంబంధించిన పనులలో ఎక్కువ లాభాన్ని ఆశించకపోవడం మంచింది. ఎక్కువ సంపాదించాలనే కోరిక నష్టాలకు దారి తీస్తుంది. ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభించే అవకాశం ఉంది.
ధనుస్సు : ఈ రాశి వారు వారి వారి పనులని విజయవంతంగా పూర్తి చేయగలరు. మీరు ఏవైనా మంచి పనులు చేయాలనుకుంటే మార్పులు చేసుకోవల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు డబ్బు విషయంలో రిస్క్ తీసుకోకపోవడం చాలా మంచిది
మకర రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆస్తులు లేదా వాహనాల కొనుగోలు చేస్తారు. ఫైనాన్స్ లేదా పెట్టుబడికి సంబంధించిన పనుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. 85 శాతం వరకు అదృష్టం లభించనుంది.
కుంభ రాశి : ఈ రాశి వారు ఈరోజు తమలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ముందుకు సాగాలి. తోబుట్టువులతో సమయం గడపడం వలన బంధం స్ట్రాంగ్ అవుతుంది. మధ్యాహ్నం సమయంలో కొన్ని అశుభవార్తలు వినడం వల్ల మీ మనసులో కొంత నిరాశగా ఉండే ఛాన్స్ ఉంది
మీన రాశి : ఈ రాశి వారు తమ పనులని సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.. మీ బడ్జెట్ ను బ్యాలెన్స్ లో ఉంచుకోవడానికి అనవసరమైన ఖర్చులను కంట్రోల్ లో ఉంచుకోక తప్పదు.