HomedevotionalHoroscope Today: October 20, 2022 గురువారం ఈ రోజు మీ రాశి ఫలాలు

Horoscope Today: October 20, 2022 గురువారం ఈ రోజు మీ రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 20 October 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి (Aries) ఫలితాలు : October 20, 2022 horoscope

ఈ రాశి వారికి నేడు అంతా అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. కష్టపడితే కాని పనులు పూర్తి కాని పరిస్థితి. శత్రువుల వలన చికాకులు ఏర్పడ‌తాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు కొంత కలుగుతాయి. శుభ ఫ‌లితాలు పొందుతారు.

వృషభ రాశి (Taurus) ఫలితాలు : October 20, 2022

ఈ రోజు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయములు చ‌ర్చిస్తారు. దూరప్రాంతపు వాళ్ళతో సంభాషణలు అనుకూలిస్తాయి. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. వృషభరాశి వారు ఈరోజున‌వ‌గ్ర‌హ పూజ చేయ‌డం మంచింది.

మిధున రాశి (Gemini) ఫలితాలు : October 20, 2022

ఈ రోజు కుటుంబముతో ఆహ్లాదముగా గడుపుతారు. ధన సంబంధిత విషయాలలో ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించడం మంచిది మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృద‌యాన్ని ప‌ఠించాలి.

కర్కాటక రాశి (Cancer) ఫలితాలు : October 20, 2022

ఈ రోజు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములో ఉన్న సమస్యలు తొల‌గిపోతాయి.. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి అడుగులు వేయ‌డం మంచిది.

సింహ రాశి (Leo) ఫలితాలు : October 20, 2022

ఈ రోజు ఈ రాశి వారు ఒత్తిళ్ళకు దూరంగా ఉండటం మంచిది. అవసరమైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. అలానే అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉంటాయి.

-Advertisement-

కన్య రాశి (Virgo) ఫలితాలు : October 20, 2022

ఈ రోజు కీర్తి కలుగును. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది.. ఖర్చులు నియంత్రించుకోవడం వ‌ల‌న ఆనందంగా ఉంటారు.. శత్రువులపై విజయము పొంద‌గ‌లుగుతారు. ఒత్తిళ్లు ఎక్కువ‌గా ఉంటాయి.

తుల రాశి (Libra) ఫలితాలు : October 20, 2022 horoscope

ఈ రోజు మీకు . సుఖ భోజన ప్రాప్తి. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగుతుంది. ధనలాభము కలుగును. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉండ‌డం మంచిది.

horoscope today newsవృశ్చిక రాశి (Scorpio) ఫలితాలు : October 20, 2022

ఈ రోజు మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇష్టమైన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో గడప‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. పిల్లల వలన చికాకులు పెరుగుతాయి.

ధనస్సు రాశి (Saggitarius) ఫలితాలు : October 20, 2022

ఈ రోజు మీకు కావలసిన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేస్తారు. శారీరక శ్రమ కలుగును. ఖర్చులు పెరుగును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును.

మకర రాశి (Capricorn) ఫలితాలు : October 20, 2022 Horoscope

ఈ రోజు ప్రయాణములు అనుకూలిస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం వ‌ల‌న కొంత ప్ర‌శాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపారముల యందు జాగ్రత్తలు వహించాలి.

కుంభ రాశి (Aquarius) ఫలితాలు : October 20, 2022

ఈ రోజు బంధుమిత్రులతో గడుపుతారు. కుటుంబములో చికాకులు ఏర్పడును. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించడం వ‌ల‌న ఇబ్బందుల‌కి దూరంగా ఉంటారు. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు ఆదిత్య హృదయము, నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి (Pisces) ఫలితాలు : October 20, 2022 Horoscope

ఈ రోజు శారీరకంగా ఉల్లాసంగా ఉండెదరు. ఆందోళనలు తగ్గును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

ఇవి కూడా చూడండి :
తీయని పాట మీ గొంతులో పలకాలంటే… ఇలా చేయండి.

రాత్రిపూట తలస్నానం చేస్తే..నష్టమా ? లాభమా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News