HomedevotionalHoroscope (20-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (20-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 20th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులను క్ర‌మంగా ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల కొంత బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

వృషభం

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకుండా చూసుకోవాలి. పిల్లలతో జాగ్రత్తవహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోనివారికి ఆటంకాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వ‌హించాలి.

మిథునం

ఈ రాశి వారికి ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి కూడా ఉంటుంది. ఆత్మీయులను కలవడంలోకొంత విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందే ఛాన్స్ ఉంది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త పాటించాలి.. పక్కదోవ పట్టించేవారి మాటలు అస్స‌లు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి కొంత మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవ‌ల‌సి ఉంటుంది.

సింహం

ఈ రాశి వారు ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందం పొందుతారు.. కీర్తి, ప్రతిష్ఠలు కూడా పొందుతారు.

-Advertisement-

horoscope today teluguకన్య

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోయే అవ‌కాశం ఉంది.. సమాజంలో మంచిపేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఎక్కువ‌గా కృషిచేస్తారు

తుల

ఈ రాశి వారు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడే అవ‌కాశం ఉంది.. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది.. ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉండే అవ‌కాశం ఉంది..

వృశ్చికం

ఈ రాశి వారు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తించే ప్ర‌య‌త్నం చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

ధనుస్సు

ఈ రాశి వారు అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం ఉత్త‌మం. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది.. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

మకరం

ఈ రాశి వారికి కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల కొంత అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం ఉత్త‌మంది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తే మంచిది

కుంభం

ఈ రాశికి చెందిన వారికి గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఎక్కువ‌గా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కొంత కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వ‌హించడం ఉత్త‌మం.

మీనం

ఈ రాశి వారికి తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ‌గా ఉంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు.

also read:

Rana Naidu : రానా నాయుడుపై తీవ్ర‌మైన ట్రోల్స్.. అయిన‌ప్ప‌టికీ సీక్వెల్ తీసుకొస్తున్నారా..!

ట్రెండింగ్ అవుతున్న సమంత, నాగచైతన్య ఫోన్ కాల్..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News