Telugu Flash News

Horoscope (20-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today in telugu

Horoscope Today, 20th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Aries horoscope

ఈ రాశి వారు ఉద్యోగంలో చాలా ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ వంటివి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ఆహార విహారాల్లో కొంత జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు ఏ మాత్రం మంచివి కావు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Taurus horoscope

ఈ రాశి వారు నేడు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం చేస్తారు. ఉద్యోగ జీవితం అయితే సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు వారికి అనుకూలంగా ఉంటాయి.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Gemini

ఈ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తారు. కొందరు బంధువులకు సలహాలు ఇచ్చి సాయ‌ప‌డతారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Cancer horoscope

ఈ రాశి వారిని కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆహార విహారా యాత్ర‌ల్లో జాగ్రత్త ఉండటం మంచిది. అధికారుల నుంచి ప్రోత్సాహం ఎక్కువ‌గా లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్స్ వ‌స్తాయి.. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Leo

ఈ రాశి వారు పొదుపు సూత్రాలు పాటిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి గుర‌య్యే అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. వింటారు. బంధువు లలో ఒకరి ఆరోగ్యం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. అధికారులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Virgo

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులు లేనిపోని మాటల వ‌ల‌న కొంత‌ ఇబ్బంది పెడతారు. మీ నుంచి సహాయం పొందిన వారు మీ ముఖం చాటేయ‌డం కొంత బాధ‌ను క‌లిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో చాలా ఆస‌క్తి చూపుతుంటారు..

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Libra horoscope

ఈ రాశి వారి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిమ్మ‌ల్ని అనవసర ఖర్చులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో పెద్దల నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు బాగానే లభిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించ‌డం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Scorpio

ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయపరంగా కొంత‌ నిలకడగానే ఉంటుంది. విలాసాల మీద ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు చాలానే వింటారు. ప్రేమ వ్యవహారాలు కొంత నిరుత్సాహం కలిగిస్తాయి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Saggitarius

ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో కొత్త మార్గాలు వెతుకుతారు. ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే సూచనలు మాత్రం చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. పిల్లల నుంచి ప‌లు సమస్యలు తలెత్తుతాయి. శుభవార్తలు ఎక్క‌వుగా వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Capricorn horoscope

ఈ రాశి వారు అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు త‌లుపుత‌డతాయి.. వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతాయి..

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Aquarius

ఈ రాశి వారికి సహచరుల నుంచి అండదండలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవ‌కాశం ఉంది. వాగ్దానాలు చేయడం, హామీ ఇవ్వడం ప్రస్తుతానికి ఏ మాత్రం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాలు మీకు నిరుత్సాహం కలిగిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2023 Pisces horoscope

ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఎంతో పెరుగుతుంది . అధికారుల నుంచి ప్రోత్సాహం, మ‌ద్దతు లభిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. సునాయాసంగా ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవ‌కాశం ఉంది.

also read :

Prabhas: ఫ్యాన్స్ అసంతృఫ్తి… ప్ర‌భాస్‌తో కార్టూన్ సినిమాలు తీస్తున్నారంటూ ఫైర్

Anushka Shetty : ముద్దుగుమ్మ అనుష్క మ‌ళ్లీ ఇంత బొద్దుగా మారిందేంటి.. షాక్‌లో ఫ్యాన్స్

 

Exit mobile version