HomedevotionalHoroscope Today telugu : 20-01-2023 శుక్రవారం రాశి ఫ‌లాలు

Horoscope Today telugu : 20-01-2023 శుక్రవారం రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 20th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Aries horoscope

మేష రాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండును. వ్యయస్థానమునందు గురుని ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండటం ఎంతైన అవ‌స‌రం.. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Taurus horoscope

వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల యందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వృషభ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు అధికమగు సూచనలు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. బృహస్పతి అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్లాలి.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Gemini

మిథున రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలం.. మిథున రాశి వారికి ఈ రోజు ధన లాభము కలుగును. అష్టమశని ప్రభావంచేత ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. దశమంలో గురుడు, లాభములో రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. .

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Cancer horoscope

కర్కాటక రాశి వారికి కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధించును. ఆరోగ్య విషయాల యందు, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Leo

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. వస్తు లాభము, సౌఖ్యము కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటిరోజు. సింహరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి.

-Advertisement-

horoscope today in telugu

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Virgo

కన్యారాశి వారు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందెదరు. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం ఎంతో మంచిది. కన్యారాశి వారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Libra horoscope

తులా రాశి వారికి చేసే ప్రతీ పనియందు చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశి వారికి ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట మంచిది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Scorpio

వృశ్చికరాశికి ఈ రోజు అంత అనుకూలముగా ఉండ‌దు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలుఏర్ప‌డ‌తాయి.. వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించాల్సి ఉంటుంది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Saggitarius

ధనూ రాశి వారికి ఈ రోజు కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికి పూర్తి చేసెదరు. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Capricorn horoscope

మకర రాశి వారు ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Aquarius

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్తమునుండి అనుకూల ఫలితాలు ఏర్ప‌డతాయా. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. కుంభరాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికి ఈ రోజు దశమ స్థానములో ఉన్న గ్రహాల అనుకూల స్థితి వలన మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 20, Pisces horoscope

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. కుటుంబమునందు సమస్యలు వేధించును. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. కీర్తి, సౌఖ్యము కలుగును. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

also read:

Yuvaraj: యువ‌రాజ్ అనారోగ్యం గురించి ముందుగానే గుర్తించిన స‌చిన్.. అత‌నికి ఎలా తెలిసింది…!

pimples: ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News