Homedevotionalhoroscope today : 19-11-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 19-11-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 19th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Aries horoscope

ఈ రాశివారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంటుంది కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండ‌డం మంచిది

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Taurus

ఈ రాశి వారికి ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెట్టే అవ‌కాశం ఉంది.. ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త‌ జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Gemini

ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండటం అవ‌స‌రం బంధువుల నుంచి సహకారం అందుకునే అవ‌కాశం ఉంటుది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పాటించాలి.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Cancer horoscope

పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇతరుల సలహాలు, సూచనలు పాటించాలి. శతృవుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి.

horoscope today newsసింహ రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Leo

విందు, వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అనుకున్నవి సాధిస్తారు.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Virgo

ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైన విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు చేయని పొరపాట్లకు కొందరు నిందలు మోపిన ప‌ట్టించుకోవద్దు. కొంద‌రితో జాగ్రత్తగా ఉండటం మంచిది.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Libra horoscope

చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి చేసే అవ‌కాశం ఉంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంటి నిర్మాణంలో కొంత పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొనే అవ‌కాశం ఉంది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Scorpio

నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవ‌కాశం ఉంది.. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు స‌మ‌సిపోతాయి.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Saggitarius

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Capricorn horoscope

మానసికంగా దృఢంగా ఉండే ఛాన్స్ ఉంది.. కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువ‌గా అందుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకునే ఛాన్స్ ఉంది.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Aquarius

ఉద్యోగంలో శ్రమ పెరుగకుండా చూసుకుంటే మంచిది. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 19, 2022 Pisces horoscope

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని సమస్యలను ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది.ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.

also read news:

చిరంజీవి చేసిన ప‌నికి అదోలా చూస్తూ ఉండిపోయిన హీరోయిన్..!

ఈ చెడు అలవాట్లకు పిల్లలను దూరంగా ఉంచండి

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News