Telugu Flash News

Horoscope (19-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

today horoscope

Horoscope Today, 19th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి నేడు రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికం అయ్యే ఛాన్స్ ఉంది.. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. ప్ర‌త్య‌ర్ధుల‌తో కొంత జాగ్ర‌త్త‌గా మెసులుకోవ‌డం మంచిది.

వృషభం

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఏర్ప‌డుతుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

మిథునం

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ‌గా ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల కొంత బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వివాదాల‌లో ఇన్వాల్వ్ కావొద్దు.

కర్కాటకం

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవ‌స‌రం.. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోతాయి.

సింహం

ఈ రాశి వారికి మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు అన్ని పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు కొంత పరిష్కారం లభిస్తుంది.

క‌న్య

ఈరాశి వారు బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఎక్కువ‌గా ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

తుల‌

ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను క‌లిసే ఛాన్స్ ఉంది.. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు.

వృశ్చికం

ఈ రాశి వారికి తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం ఎంతైన అవసరం.

ధ‌నుస్సు

ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకునే అవ‌కాశం ఉంది.. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

మకరం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను క్ర‌మంగా ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కొంత‌ కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా అన్ని ప‌నులు పూర్తిచేసుకోలేక పోతారు.

కుంభం

ఈ రాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల చాలా లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోవ‌ల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.

మీనం

ఈ రాశి వారు ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేసే అవ‌కాశం ఉంది.. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను కొంత ఎదుర్కోవాల్సి వస్తుంది.

also read :

Viral Video : మల్లెపూలతో ఎంత సక్కగున్నవే తెల్ల పిల్లా..!

Chiranjeevi: రామ్ చ‌ర‌ణ్‌ని ఆకాశానికి ఎత్తేసిన జేమ్స్ కామెరూన్.. ఫుల్ ఖుష్ అయిన చిరు

Exit mobile version