Telugu Flash News

Horoscope Today: 18-09-2022 ఆదివారం రాశి ఫ‌లాలు..ఈ రాశి వారు ఆ ప‌ని వాయిదా వేసుకోవ‌డం మంచిది..!

horoscope today

Horoscope Today:

మేషం

ఈ రాశి వారు కుటుంబ సభ్యులు, బంధువులతో స‌ర‌దాగా ఉంటారు. ఏదైనా పత్రాలపై సంతకం చేయాలనుకుంటే, అన్నింటినీ చాలా జాగ్రత్తగా చదవాలి. భార్యభర్తలు పరస్పర సహకారంతో అన్ని స‌మ‌స్య‌ల‌ని సాల్వ్ చేసుకోగ‌లుగుతారు.

వృష‌భం

ఈ రాశి వారు అనుభవం ఉన్న వారి మార్గదర్శకత్వంలో న‌డిచి అనేక సమస్యలను పరిష్కరించొచ్చు. వ్యాపారులు ఈరోజు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రింయాల్సి ఉంది.. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది.

మిథునం

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నేడు బాగానే ఉంటుంది. వ్యక్తిగత పనులతో పాటు పిల్లల సమస్యలపై కూడా కొంత‌ శ్రద్ధ వహించాలి. మీ మద్దతు వారి ఆత్మవిశ్వాసాన్ని మ‌రింత పెంచుతుంది. ఈరోజు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే,వాయిదా వేసుకోవ‌డం మంచిది

క‌ర్కాట‌కం

మీ మాటతీరుతో అందరినీ ఆకర్షిస్తుంటారు. చేసే ప‌నుల‌లో ఆటంకాలు తొల‌గిపోవ‌డంతో అల‌స‌ట కూడా త‌గ్గుతుంది. నేడు క‌నుక పిల్లలకు సంబంధించిన పనులు పూర్తి చేయకపోతే, మీ పిల్లలు చదువులకు దూరమయ్యే అవకాశం ఉంది. 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

సింహ రాశి

ఈ రాశి వారికి గ్రహాల స్థానం చాలా అనుకూలంగా ఉండ‌డం మంచి ప‌రిణామం. అపరిచితులతో ఆకస్మిక సమావేశం మీకు కొంత లాభాన్ని క‌లిగిస్తుంది. ఈరోజు వ్యాపారులకు కొన్ని మంచి ఆర్డర్లు రావ‌డంతో సంతోషంగా ఫీల‌వుతారు.

క‌న్యా రాశి

ఈ రాశి వారు చాలా కాలంగా నిలిచిపోయిన ప‌నుల‌ని పూర్తి చేసేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. సోషల్ మీడియా, తప్పుడు కార్యక్రమాల్లో పాల్గొన్ని సమయాన్ని వృథా చేయ‌కుండా ఉండాలి

తులా రాశి

ఈ రాశి వారు చాలా బ్యాలెన్స్‌గా ఉంటారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. చాలా విషయాల్లో ఓపికగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయానికి సంబంధించిన ప్రణాళికలలో కాస్త ఇబ్బంది ఉంటుంది.

వృశ్చికం

ఈ రోజు మీరు మతపరమైన ప్రదేశంలో గ‌డిపేందుకు ఆస‌క్తి చూపుతారు. స్నేహితుడి స్వార్థం కారణంగా మీతో సంబంధాన్ని చెడగొ్ట్టే అవ‌కాశం వ‌చ్చింది. ఎవ‌రిని ఎక్కువ‌గా న‌మ్మ‌క‌పోవ‌డం మంచిది .92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

ధ‌నుస్సు

తొందరపాటు వల్ల మీకు నష్టం జరిగే అవ‌కాశం ఉంది . విద్యార్థులకు ఈరోజు విద్య విషయంలో ఏకాగ్రత ఉండదు. ఈరోజు పిల్లలకు సంబంధించిన కార్యకలాపాలపై శ్రద్ధ చూపడం చాలా అవ‌స‌రం. వ్యాపారులు ఈరోజు పోటీదారుల విషయంలో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది

మ‌క‌ర రాశి

ఈరోజు ప్రతికూల కార్యకలాపాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు ఈరోజు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. వ్యాపారులు ఏదైనా పునరుద్ధరణ లేదా ఫీల్డ్ సంబంధిత ప్రణాళిక వంటి విష‌యాల‌పై దృష్టి కేంద్రీక‌రించాలి. 64 శాతం వరకు అదృష్టం వ‌స్తుంది.

కుంభం

ఈ రాశి వారు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మీ ఇంటి అలంకరణ కోసం ఈరోజు ఎక్కువగా ఖర్చు చేసే అవ‌కాశం ఉంది. పాతగొడవలు మళ్లీ చెలరేగే అవ‌కాశం ఉన్నందున మీరు ఆలోచ‌న‌ల‌ని కాస్త సానుకూలంగా ఉంచుకోవ‌డం మంచిది. ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే బాగుంటుంది.

మీనం

ఈ రాశి వారికి ఆదాయ వనరులు పెరిగే అవ‌కాశం ఉంది. బంధువులతో ఏదైనా విషయంలో మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా ఉంటే మంచిది. కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకునే ముందు జాగ్రత్తా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

Exit mobile version