Horoscope Today, 18th may 2023: Check astrological prediction for your zodiac signs
మేష రాశి
ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వాహనాలు, గృహాలు వంటి వాటికి ధనము ఖర్చు ఎక్కువ చేస్తారు. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలము, వ్యాపారస్తులకు వ్యాపారమునందు లాభములు గడించును. వృషభరాశి వారు ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు దూరంగా ఉంటే మంచిది
మిథున రాశి
ఈ రాశి వారికి శారీరక శ్రమ, మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించడం మంచిది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుందికుజుని ప్రభావం చేత ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారములయందు మధ్యస్థ ఫలితములు ఏర్పడుతున్నవి. దశమ స్థానమునందు శుక్ర, రాహువుల సంచారం వలన ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. .
సింహ రాశి
ఈ రాశి వారికి చేసే పనులయందు శ్రమ మరియు చికాకులు అధికమగును. ఆర్థిక విషయాలు కొంత ఇబ్బంది పెడతతాయి.. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థులకు జాగ్రత్త వహించవలసినటువంటి సమయము ఇది . స్త్రీలు కుటుంబవిషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించడం ఉత్తమం
కన్య రాశి
ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని సకాలంలో పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగుతుంది.
తులా రాశి
ఈ రాశి వారికి చేసే పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలుగును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించ వలసి ఉంటుంది.
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. ప్రయాణములు అనుకూలిస్తాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. ఈ రాశి వారికి శని అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పాలి.
మకర రాశి :
ఈ రాశి వారికి కుటుంబమునందు సమస్యలు, వివాదాలు, మానసిక ఘర్షణలు అధికమగును. చతుర్ధ స్థానమునందు శుక్ర, రాహువులు, ఆరో స్థానమునందు కుజుడు అనుకూలిస్తుంది.. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.
కుంభ రాశి :
ఈ రాశి వారికి మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. పనుల యందు ఆలస్యము. కుటుంబ వ్యవహారాలయందు చికాకులు కలుగుతాయి.. కుంభ రాశివారు వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.
మీన రాశి :
ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు అధికమగును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. విద్యార్థులకు ఇది కష్ట సమయము. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది.
also read :
Keerthy Suresh: మళ్లీ వార్తలలోకి కీర్తి సురేష్ పెళ్లి.. ఆమె భర్త ఇతడేనా?
Tarun:తరుణ్ పెళ్లి గురించి ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చారు.. ఎప్పుడంటే..!
Varun Tej:వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ త్వరలోనే.. ఈ వార్త ఎలా వచ్చిందంటే..!
Police:విరాట్ భార్య, అమితాబ్ బచ్చన్లకి పోలీసుల వార్నింగ్.. ఎందుకంటే..!