HomedevotionalHoroscope (18-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (18-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 18th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Aries horoscope

ఈ రాశి వారికి ఆర్థికపరంగా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఓ అడుగు ముందుకేస్తారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Taurus horoscope

ఈ రాశి వారు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ పరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారంలో భాగస్వాములు ఎంతో సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వినటానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Gemini

ఈ రాశి వారు మిత్రులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో తిప్ప‌లు ఎక్కువ ఉంటాయి.. ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉంటుంది కానీ శరీరానికి విశ్రాంతి అవసరం. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు సాగిస్తారు. విద్యార్థులకు మంచి రోజు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Cancer horoscope

ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఐటీ రంగంలోని వారికి అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Leo

ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోయే అవ‌కాశం ఉంది.

-Advertisement-

horoscope today in teluguకన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Virgo

ఈ రాశి వారికి మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వాహన యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినే ఛాన్స్ ఉంది.. ఉద్యోగం విషయంలో మంచి ఆఫర్ అందుతుంది. ఆశించిన స్థాయిలో పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగానే కొనసాగుతాయి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Libra horoscope

ఈ రాశి వారికి ఖర్చులు కూడా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగంలో అధికారులు కారణంగా కొన్ని చికాకులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు మ‌న‌కు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Scorpio

ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొండి బాకీలను వసూలు చేసే పనిని యాక్టివ్‌గా చేస్తారు.. ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Saggitarius

ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వ‌డం అస్స‌లు మంచిది కాదు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Capricorn horoscope

ఈ రాశి వారు ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. సహచరుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Aquarius

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పొదుపు పాటిస్తారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరిగి శారీరక శ్రమకు గురవుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2023 Pisces horoscope

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగం పరిస్థితి బాగానే ఉంటుంది. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. వ్యాపారులు కొద్దిగా లాభాలు గడిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోయే అవ‌కాశం ఉంది..

మరిన్ని చదవండి :

Maha Shivaratri : శివరాత్రి జాగారం నాడు ఏం చేయాలి? ఎలా చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుంది?

maha shivaratri : మహాశివరాత్రి రోజున చేయకూడని పనులు ఇవే.. పరమేశ్వర అనుగ్రహం కోసం ఇలా చేయండి..

Maha Shivaratri 2023 : ఈ గుడిలో మోడ్రన్ డ్రెస్సులు నిషేధం.. శివరాత్రి రోజున సంప్రదాయానికి ప్రాధాన్యత..

jyotirlingas in maharashtra : మహారాష్ట్రలోని 5 జ్యోతిర్లింగాలు

Maha Shivratri : మహా శివరాత్రి నాడు ఉపవాసం వల్ల ఫలితమేంటి?

జ్యోతిర్లింగాలు ఎన్ని అవి ఎక్కడ ఉన్నాయి.. వాటి విశేషాలు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News