Horoscope Today, 18th january 2023: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనీయవద్దు. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది. మిత్రులతో సఖ్యతగా ఉండడం చాలా మంచిది.
వృషభం
ఈ రాశి వారికి పనిభారం, శ్రమాధిక్యం పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళను అధిగమించేందుకు మరింత కృషి చేయాలి. కుటుంబ సభ్యుల మాటలకుఎక్కువ విలువనివ్వాలి. కలహాలకు చోటివ్వడం మానుకోవాలి.. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
మిథునం
ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువగా లాభిస్తుంది. ఒక వార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆదిత్య హృదయం పఠిస్తే ఎంతో బాగుంటుంది. ముఖ్యమైన విషయాలపై ఎక్కువ దృష్టి సారిస్తారు.
కర్కాటకం
ఈ రాశులవారికి శుభఘడియలు ఎంతగానో నడుస్తున్నాయి. సమయస్ఫూర్తి, బుద్ధిబలాంతో ముందుకు సాగాల్సి ఉంది.. వ్యాపారాల్లో ఎంతో లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దత్తాత్రేయ స్వామి సందర్శనం వల్ల అందరికి మంచి జరుగుతుంది.
సింహం
ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి.. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంతోషాన్ని పంచుకునే సమయం వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధనతో మేలు కూడా చేకూరుతుంది. కొన్ని పనుల విషయంలో జాగ్రత్తలు వహించాలి.
కన్య
ఈ రాశి వారు శ్రమాధిక్యం పెరగకుండా చూసుకోవాలి. మనసుకు నచ్చినవారితో సంతోషంగా గడిపే ఛాన్స్ దక్కుతుంది.. ఆనందాన్ని పంచుకుంటారు. శుభవార్తలు వింటారు. దుర్గాస్తోత్రం చదివితే ఎంతో ఉత్తమం. కొన్ని సంఘటనలు కొందరికి మనసుకి బాధని కలిగిస్తాయి
తుల
ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుంది.. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు పొందుతారు. గోవింద నామాలు చదివితే మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది. కీలక విషయాలలో జాగ్రత్తలు వహించాలి.
వృశ్చికం
ఈ రాశివారికి శుభఘడియలు నడుస్తున్నాయి. కీలక విషయాలు, ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది.. అనవసర విషయాలు, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
ధనస్సు
ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురువతాయి. చేపట్టిన పనుల్లో అనుకోని అవాంతరాలు. సమస్యలను పట్టుదలతో అధిగమించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనసుకు ప్రశాంతత ఉంటుంది. నవగ్రహ ధ్యానంతో ఎంతో మేలు జరుగుతుంది.
మకరం
ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ఉత్తమం.
కుంభం
సన్నిహితులు, స్నేహితుల నుంచి అవసరానికి మించిన ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారా రంగాలవారు శుభవార్తలు ఎక్కువగా వింటారు. సమయస్ఫూర్తితో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకుంటే మీకు అంతా శుభం కలుగుతుంది.
మీనం
ఈ రాశి వారికి శుభకాలం. కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువగా లభిస్తుంది. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన మాత్రం అస్సలు మరవద్దు.
also read:
క్యారెట్, బీట్‌రూట్, టమాటా కాంబో జ్యూస్.. పరగడుపున తాగితే లాభాలివే!
Rishabh Pant: రిషబ్ అభిమానులకి షాకింగ్ న్యూస్.. వచ్చే ఏడాది కూడా పంత్ ఆడడం డౌటే…!