Horoscope Today, 17th March 2023: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు తలెత్తుతాయి.. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేరు.
వృషభం
ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో తరచు కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకునే అవకాశం ఉంది.. ఆకస్మిక ధనలాభయోగం ఎక్కువగా ఉంటుంది.
మిథునం
ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఎక్కువ. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం వస్తుంది.
కర్కాటకం
ఈ రాశి వారికి రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు చాలానే చేస్తుంటారు.. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది.
సింహం
ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఎక్కువ. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందే ఛాన్స్ ఉంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవసరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోయే అవకాశం ఉంది.
కన్య
ఈ రాశి వారు బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేసే అవకాశం ఉంది.. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు క్రమేపి తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు క్రమంగా దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
తుల
ఈ రాశి వారికి మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తి చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని ఎక్కువగా సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది.
వృశ్చికం
ఈ రాశి వారికి గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులని ఎక్కువగా గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందే ఛాన్స్ ఉంది.. సత్కార్యాల్లో పాల్గొంటారు.
ధనుస్సు
ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో క్రమంగా మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకునే అవకాశం ఉంది.. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం ఎంతైన అవసరం.
మకరం
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందే ఛాన్స్ ఉంది.. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఎక్కువగా ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు కూడా క్రమంగా తొలగుతాయి.
కుంభం
ఈ రాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందే ఛాన్స్ ఉంది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోవల్సి ఉంటుంది.
మీనం
ఈ రాశి వారికి ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందే అవకాశం ఉంది.. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవసరం.
also read news :
Naatu Naatu Song : ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు డ్యాన్స్ అదరగొట్టిన మాజీ క్రికెటర్లు!
South Korea : వామ్మో పెళ్లా.. మాకొద్దు బాబోయ్.. దక్షిణ కొరియాలో వింత పరిస్థితి..!
Prabhas: చికిత్స కోసం ఫారిన్‌కి పయనమైన ప్రభాస్… అసలేమైంది..!
TSPSC Paper Leak : పేపర్ లీకేజీ ఘటనలో నిందితురాలి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!
Chiranjeevi: ఎంత గొప్ప మనసు.. తమిళ విలన్ ఆరోగ్యం కోసం రూ.45లక్షలు ఖర్చు చేసిన చిరంజీవి
Ananya Panday: పెళ్లిలో సీక్రెట్‌గా సిగరెట్ తాగుతూ దొరికిన అనన్య