Horoscope Today, 17th february 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Aries horoscope
ఈ రాశి వారు తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి అయితే కనిపిస్తుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Taurus horoscope
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొన్ని ముఖ్య అవసరాలను తీర్చుకుంటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేసే అవకాశం కూడా ఉంది.. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అన్నదమ్ములతో సయోధ్య పెరుగుతుంది. బంధువులకు సంబంధించిన ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Gemini
ఈ రాశి వారు అనవసర ఖర్చు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇంటి పనుల విషయంలో తిప్పలు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారంలో కొన్ని శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Cancer horoscope
ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ఆవేశ కావేషాలు, మొండితనం పనికిరాదు. అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Leo
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. తొందరపాటు నిర్ణయాలతో లేదా అనవసర మాటలతో సమస్యలు కొని తెచ్చుకోవద్దు. వ్యక్తిగత విషయాల్లో సన్నిహితుల సహకారం తీసుకోవడం చాలా మంచిది. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Virgo
ఈ రాశి వారు ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే అవకాశం ఎక్కువ. అధికారుల నుంచి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Libra horoscope
ఈ రాశఙ వారికి ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తయ్యే ఛాన్స్ ఉంది.. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల సహాయంతో ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Scorpio
ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయ పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. బంధువుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి చికాకు పెడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. సహచరుల నుంచి సహకారం ఉంటుంది.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Saggitarius
ఈ రాశి వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకువెళ్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల సమస్యలు పరిష్కారం అవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Capricorn horoscope
ఈ రాశఙ వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. హద్దులుదాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులకు విహారయాత్ర చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది.. ఆర్థిక పరిస్థితి పరవాలేదు అన్నట్టుగా ఉంటుంది. వాగ్దానాలకు, హామీలకు కొంతకాలం పాటు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Aquarius
ఈ రాశి వారు రోజంతా క్షణం తీరిక లేకుండా ఉంటారు. వ్యక్తిగత పనులు, ఇంటి పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. వృత్తి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం అవసరం. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 17, 2023 Pisces horoscope
ఈ రాశి వారు బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేసే అవకాశం ఉంది.. కొద్ది ప్రయత్నాలతో అదనపు ఆదాయానికి అవకాశాలు మెరుగవుతాయి. పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు.
also read :
Pooja Hegde: పూజా హెగ్డే పని అయిపోయినట్టేనా.. ఆఫర్స్ కోసం ఆ పని చేయాల్సిందేనా..!
Kantara : కాంతార హవా మాములుగా లేదు.. మరో అరుదైన అవార్డ్
Sri Satya: శ్రీసత్య కోసం మెహబూబ్ ఆత్మహత్యాయత్నం చేశాడా..!